Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డికి కూటమి సర్కార్ వరుస షాకులు ఇస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓటమిపాలు అయిన తర్వాత ఆయన పై వరుసకేసులను నమోదు చేస్తూ అసలైన ఆట మొదలుపెట్టారని చెప్పాలి. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాను రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా పర్యటించే హక్కు తనకుందని చెబుతున్న జగన్… ఆయా పర్యటనల్లో పోలీసు ఆంక్షలను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో జగన్ పర్యటనలో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల రెంటపాళ్ల పర్యటనలో భాగంగా సింగయ్య అనే కార్యకర్త స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయారు.
ఇలా ఈ విషయం ప్రస్తుతం ఏపీలో సంచలనగా మారింది. అసలు సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కింద పడలేదని ఆయనని మరొక వాహనం ఢీ కొట్టడం వల్లే చనిపోయారంటూ పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే నాలుగు రోజులలో జగన్మోహన్ రెడ్డి కారుకిందే పడి చనిపోయారు అంటూ ఒక వీడియోని బయటకు వదిలారు. అయితే ఈ వీడియో పూర్తిగా ఫేక్ అని వైసిపి నేతలు ఖండిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి పై మాత్రం కేసు నమోదు అయింది అలాగే ఆ కారు డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు వైసిపి నేతల పై కూడా కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం వారందరికీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులను అందించేందుకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన నల్లపాడు, గుంటూరు పోలీసులు పార్టీ కార్యాలయ ఇంచార్జీ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి అందజేశారు.
ఇంతటితో ఆగని పోలీసులు అక్కడే ఉన్నటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా సీజ్ చేస్తున్నట్లు నోటీసులను అందజేస్తూ ఆ కారును తీసుకెళ్లిపోయారు.. ఈ కేసులో దర్యాప్తు ముగిసే వరకు జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ కారు తిరిగి ఇవ్వడం కుదరదని తెలిపారు. ఇలా తన బుల్లెట్ ప్రూఫ్ సీజ్ చేయడంతో జగన్మోహన్ మెడకు ఉచ్చు బిగుస్తుందని చెప్పాలి. రాబోయే నాలుగేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటిని ఇంకా చాలా ఎదుర్కోవాల్సి వస్తుందని గత ఐదు సంవత్సరాల కాలంలో ఆయన చేసిన అవినీతిని బయటకు తీసే ప్రయత్నంలో కూటమినేతలు ఉన్నట్టు తెలుస్తోంది .
