రాజకీయాల్లో మంచి, చెడులు ఉండవు, కేవలం వ్యూహాలు మాత్రమే ఉంటాయి. ఈ వ్యూహాలను ఎవరు బాగా రచిస్తే వాళ్ళు రాజకీయలను ఏలుతారు. అలా పక్కా వ్యూహంతో ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న టీడీపీని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మట్టి కరిపించారు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు టీడీపీ నాయకులు ఇంకా కోలుకోవడం లేదు. అయితే ఇప్పుడు జగన్ అప్పుడు 2024 రానున్న ఎన్నికలకు కూడా పతకం రచించి, దాన్ని పక్కాగా అమలు చేసే పనిలో ఉన్నారు.
జగన్ వ్యూహం ఏంటి!!
జగన్ ఇప్పటిదాకా నగదు బదిలీ పధకాలనే పెద్ద ఎత్తున ఏపీలో అమలు చేశారు. వాటి వల్ల ఓట్లు రాలవా? అంటే పడతాయి కానీ పక్కా అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే ఖర్చు చేస్తే కరిగిపోయేది కరెన్సీ. అందుకే ఇపుడు శాశ్వతంగా జనం గుండెల్లో నిలిచిపోయే స్కీం కే జగన్ తెర తీశారు. అదే పక్కా ఇళ్ళ స్కీం. దీని వల్ల జగన్ సాధిస్తే పొలిటికల్ మైలేజ్ ఊహకు అందనంత ఎక్కువగా దక్కుతుంది అంటున్నారు. ఒక విధంగా జగన్ చేతిలో ఎప్పటికీ పదిలంగా ఉండే పొలిటికల్ ట్రంప్ కార్డు కూడా అదే అవుతుంది అంటున్నారు.
అతి పెద్ద ఓటు బ్యాంక్ వైసీపీదే
ఏపీలో ముప్పయి లక్షల ఇళ్ళ పట్టాలను జగన్ పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. దశలవారీగా వాటిని నిర్మాణం కూడా చేపడుతున్నారు. మొత్తం ఈ తతంగం పూర్తి కావాలీ అంటే లక్ష కోట్ల నిధులు అవసరం. సరే దాని సంగతి పక్కన పెడితే జగన్ ఇళ్ళు ఇస్తున్నారు అన్నదే ఇక్కడ ముఖ్యమైన పాయింట్. ఇక ముప్పయి లక్షల ఇళ్ళనే బేరీజు వేస్తే ఒక్కో ఇంటిలో నలుగురు సభ్యులను వేసుకున్నా కూడా కచ్చితంగా కోటీ ఇరవై లక్షల మంది జనాభా ఉంటారు. అంటే అతి పెద్ద ఓటు బ్యాంక్ ఈ విధంగా జగన్ పరం కాబోతోంది.