Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పలనాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా సింగయ్య అనే కార్యకర్త మరణించారు. సింగయ్య జగన్ పర్యటనలో పాల్గొన్న సమయంలో జగన్ కాన్వాయ్ అయనను ఢీకొట్టడం వల్ల మరణించారనే వార్తలు బయటకు వచ్చాయి పోలీసులు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు అయితే ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకు సింగయ్య జగన్ కాన్వాయ్ ఢీ కొట్టి చనిపోలేదని స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద పడి చనిపోయారు అంటూ ఒక వీడియో బయటకు వచ్చింది.
ఇక ఈ వీడియో పోలీసులు కూడా స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి కారు కారణంగానే చనిపోయారని తెలిపారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి పై కేసు నమోదు చేయడం ఆయన కారు సీజ్ చేయడం వంటివి కూడా జరిగాయి.. ఇక ఈ వీడియోని తప్పుపడుతూ వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు సింగయ్య మరణించిన నాలుగు రోజులకు ఇలాంటి వీడియోని బయటకు వదలడం వెనక ఆంతర్యమేంటి ఇది నిజమైన వీడియో కాదని సింగయ్య కు సంబంధించి మరొక వీడియోని వైసిపి విడుదల చేశారు.
ఇలా ఈ ఘటన గురించి పెద్ద ఎత్తున సందేహాలు ఉన్న నేపథ్యంలో ఈ వీడియోలను ఫోరెన్సిక్ పంపారు. డ్రోన్ వీడియోలు, సీసీ కెమెరా ఫుటేజ్, సెల్‌ఫోన్ అన్ని వీడియోలను పరిశీలించిన ఫోరెన్సిక్ సింగయ్య మరణం పై నివేదికను వెల్లడించారు సింగయ్య జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి మరణించారు అంటూ రిపోర్ట్ ఇవ్వడంతో కేసుకు సంబంధించిన మిస్టరీ వీడింది.ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై కూడా శాఖాపరమైన విచారణ జరుగుతోంది. నిజాల్ని దాచేందుకు ఎవరు బాధ్యులు అనే దానిపై ఇప్పుడు మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది.