ఆలస్యం ఎందుకు.. బీజేపీని వైసీపీతో కలిపేసుకోండి జగన్ 

Another break in YS Jagan's cases

ప్రధాని నరేంద్ర మోడీ విషయంలో ప్రాంతీయ పార్టీల వైఖరి రోజురోజుకూ మొత్తబడిపోతోంది.  కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే గౌరవమో లేకపోతే భయమో తెలియదు కానీ ప్రతి పార్టీ, ప్రతి నాయకుడు వారికి వత్తాసు పలకడానికే  చూస్తున్నారు తప్ప ప్రశ్నించే ధోరణిని పూర్తిగా వదిలేసుకున్నారు.  ఈ వైఖరి తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో పూర్తిగా బట్టబయలైంది.  కేంద్రం బడ్జెట్లో రాష్ట్రానికి ఏమీ ఒరగలేదనేది అందరికీ తెలుసు.  పైపెచ్చు పెట్టుబడుల ఉపసంహరణల్లో భాగంగా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేస్తున్నారు.  బీజేపీతో మొదటి నుండి దోస్తీ కట్టడానికి ఉవ్విల్లూరుతూ మోడీ అనుగ్రహం కోసం అర్రులు చాచుకుని కూర్చున్న చంద్రబాబు నాయుడు కేంద్రం తరపున రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా దాన్ని జగన్ మీదనే తోసేస్తారు తప్ప మోడీని ఒక్క మాట అనలేరు. 

YS Jagan U turn on unipon budget
YS Jagan U turn on unipon budget

ఇక జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న రోజు నుండి ప్రశ్నించే  స్వేచ్చనే కోల్పోయారు.  బడ్జెట్ కేటాయింపులు లేకున్నా, స్టీల్ ప్లాంట్ పోతున్నా, పెట్రోల్ ధరలు పెరిగిపోయినా, రైతు ఉద్యమాలు జరుగుతున్నా నోరెత్తలేరు.  ఇక ప్రధానమైన పాలకవర్గం వైసీపీది కూడ ఇదే పరిస్థితి.  ప్రతిపక్షాలు సాగిలపడ్డాయంటే నష్టం లేదు కానీ పాలక పార్టీయే భజన మొదలుపెడితే ఏమనుకోవాలి.  హోదా, పోలవరం లాంటి అంశాల్లోనే గింజుకుంటున్న జగన్ ఇప్పుడు బడ్జెట్ విషయంలో కూడ యూటర్న్ తీసేసుకున్నారు.  బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విజయసాయిరెడ్డి ఇది ఎన్నికల బడ్జెట్ అని, రాష్ట్రానికి ఏమీ ఇవ్వలేదని అన్నారు.  ఈ విషయమై పెద్ద పోరాటమే చేస్తానని చెప్పుకొచ్చారు.  

కానీ ఇప్పుడు చూస్తే సీన్ మారిపోయింది.  స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రాన్ని  బుజ్జగించాలనే ప్రయత్నంలో బడ్జెట్ మీద పొగడ్తలు కురిపించారు.  కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా దార్శనికంగా ఉందని అనేశారు.  కేంద్ర బడ్జెట్ దేశానికి ఉపకరిస్తుంది కానీ రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగకరంగా లేదనే ధోరణిలో మాట్లాడారు.  మరి ఈ ధోరణిని ఎలా తీసుకోవాలో రాష్ట్ర ప్రజలకు అర్థంకావట్లేదు.  దేశానికి ఉపయోగం కానీ రాష్ట్రానికి కాదని అనడం వింటే అంటే మనం రాష్ట్రం దేశంలో లేదా, దేశం ప్రయోజనం పొందితే రాష్ట్రం పొందినట్టు కాదా.  సరే వైసీపీ లెక్కల్లో రాష్ట్రానికి లాభం లేదు దేశానికే లాభమనుకున్నా మొన్న విజయసాయిరెడ్డి ఇది ఎన్నికల బడ్జెట్ మాత్రమే అని బీజేపీ స్వార్థపూరిత ధోరణిని ఎలివేట్ చేస్తూ ఎందుకు మాట్లాడారో మరి.  ఇప్పుడే పారదర్శకమైన బడ్జెట్ అన్నారంటే రేపు పార్లమెంట్ సమావేశాల్లో పొగడకుండా ఉండరు.  ఇలా రాష్ట్రంలో నొక్కులు నొక్కుతూ కేంద్రంలో అంటకాగే బదులు బీజేపీని రాష్ట్రంలో కలిపేసుకుంటే  పోదా అంటున్నారు జనం.