Y.S.Jagan: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా కొమ్మినేని శ్రీనివాస్ రావు బెయిల్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. కొమ్మినేని శ్రీనివాసరావు ఒక న్యూస్ డిబేట్ లో భాగంగా అమరావతి మహిళలను ఉద్దేశపూర్వకంగా కించపరుస్తూ మాట్లాడారని ఆయనపై కేసులు నమోదు చేయడం తనని అరెస్టు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సాక్షి కార్యాలయాల పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక కొమ్మినేని శ్రీనివాసరావు క్షమాపణలు చెప్పాలని అలాగే భారతి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కూడా క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్లు వచ్చాయి.
ఇక కొమ్మనేని శ్రీనివాసరావు పై కేసు నమోదు చేయడంతో పోలీసులు తనను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరచడంతో న్యాయస్థానం ఇతని అరెస్టు విషయంలో పోలీసుల వ్యవహార శైలిని మందలించి ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఒక న్యూస్ డిబేట్లో పాల్గొన్నప్పుడు అక్కడ జరిగే సంభాషణతో యాంకర్ కు సంబంధం ఉండదని కోర్టు మందలించడమే కాకుండా, ఇకపై ఎలాంటి పరిస్థితులలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కొమ్మినేని హెచ్చరించి బెయిల్ మంజూరు చేసింది.
ఈ విధంగా కొమ్మనేని శ్రీనివాసరావుకు బెయిల్ రావడంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా “సత్యమేవ జయతే” అనే ట్వీట్ చేశారు.సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం ఏపీ సీఎం చంద్రబాబు గారికి పెద్ద చెంపపెట్టు వంటిదని అన్నారు. అదే విధంగా.. నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న ఏపీ ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పిందని తెలిపారు.
ప్రాథమిక హక్కులకు, స్వేచ్ఛకు ఈ అరెస్టు తీవ్ర భంగకరమని కోర్టు చెప్పడం, ఏపీ పోలీసులకు, ప్రభుత్వానికి చురకలు పెట్టడం వంటిదన్నారు. అమరావతి నిర్మాణం పేరుత వేలకోట్ల అవినీతికి పాల్పడుతూ వాటిని బయట పెట్టకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసమే ఈ వ్యవహారాన్ని చంద్రబాబు నాయుడు తెరపైకి తెచ్చారని జగన్ మండిపడ్డారు.చంద్రబాబుగారు తన తప్పును తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైసీపీకి, సాక్షి మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడ్డంలోనే తన కుట్ర ఏంటో తెలుస్తోందని తెలిపారు.కుట్రలు, కుతంత్రాలు ఎల్లకాలం చెల్లవని సత్యమేవ జయతే అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.