‘చేజారిపోతోంది బాబూ’ అంటూ సీనియర్లు వార్నింగ్.. వెంటనే అలర్ట్ అయిన జగన్ 

YS Jagan ready for a fight with High court

వైసీపీలో అధికారం చేపట్టకముందు ఉన్న ఉన్నంత ఊపు, అధికారంలోకి వచ్చాక లేదు.  ప్రింట్, డిజిటల్, సోషల్ మీడియా ఇలా ప్రతి వేదిక మీదా పెద్ద ఎత్తున హడావుడి చేసిన ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.  ఏదో కొందరు తప్ప పెద్దగా ఎవరి హంగామా కనిపించడం లేదు.  కారణం అధినేత వైఎస్ జగన్ పార్టీ మీద దృష్టి పెట్టకపోవడమే.  దానికి కూడా ఒక రీజన్ ఉంది.  వైఎస్ జగన్ ఎక్కువగా సంక్షేమ పథకాల అమలు మీద సమయం గడుపుతున్నారు.  నవరత్నాలతో పాటు కొత్త స్కీములు, వాటికి నిధులు సమకూర్పు, వాటి అమలుతోనే ఆయనకు టైమ్ సరిపోతోంది.  పైగా మూడు రాజధానులు, అమరావతి రైతులు వంటి అంశాలు కూడా ప్రధానంగా ఉన్నాయి.  

Chandrababu surrender himself to YS Jagan

 

ఇలా అనేక పాలనా పరమైన విధులతో తీరిక లేకుండా గడుపుతుండటం వలన మునుపటిలా పార్టీ మీద, క్యాడర్ మీద, నియోజకవర్గాల మీద ఆయన చూపు పడటం లేదు.  ఫలితంగా అనేక సమస్యలు తలెత్తాయి.  అసలు గెలిచిన ఎమ్మెల్యేలు అందరితోనే జగన్ ఇంకా పూర్తిస్థాయిలో ఇంటరాక్ట్ కాలేదు.  ఈ గ్యాప్ కారణంగా అనేక నియోజకవర్గాల్లో సమన్వయం పూర్తిగా దెబ్బతిందట.  కొందరు ప్రజాప్రతినిధులకు పార్టీ అధికార ప్రతినిధులకు అస్సలు పొసగడం లేదట.  పార్టీ కార్యక్రమాలు జరగకపోవడంతో ప్రతినిధులు, సమన్వయకర్తలకు ప్రాధాన్యం లేకుండా పోయిందట.  ఎమ్మెల్యేలు, ఎంపీలు వారిని పట్టించుకోవడం లేదట. 
 
ఇక పాత నేతలకు, కొత్తగా పార్టీలో చేరిన వారికి నియోజకవర్గాల్లో అధికారం విషయంలో కోల్డ్ వార్ నడుస్తోంది.  బయటకు కనబడటం లేదు కానీ చాలామంది లీడర్లు పార్టీ పరంగా కాకుండా సొంతగా గ్రూపులు నడుపుకుంటున్నారు.  నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో మంత్రులు ఈ విషయాలన్నీ సీఎం ముందు ఏకరువు పెట్టి, ఇప్పటికే ఆలస్యం అయిందని, ఇకనైనా పార్టీకి, క్యాడర్ కు కొంత సమయం కేటాయించి దిశా నిర్దేశం చేయాలని, నేతల మధ్య నెలకొన్న గొడవలను పరిష్కరించాలని సూచించారట.  అన్నీ విన్న జగన్ వాటిలో వాస్తవం ఉంది కాబట్టి ఇకపై పార్టీ కార్యకలాపాలకు సమయం వెచ్చిస్తానని, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని మాటిచ్చారట.