ఇప్పుడంటే నదీ జలాల వివాధం రాజుకుని ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉన్నారు కానీ గతంలో ఇద్దరి నడుమ మంచి సయోధ్య ఉండేది. ఇద్దరూ అన్నదమ్ముల్లా మెలిగారు. తెలుగు రాష్ట్రాలను కలకాలం కలిసి పాలిద్దాం అనుకుంటూ ఉండేవారు. కానీ ఇప్పడు పాత పరిస్థితులు లేవు. అలాగని మరీ వైషమ్యాలు కూడ లేవు. నీళ్ల విషం కాబట్టి ఇద్దరూ మంకు పట్టు పట్టుకుని ఉన్నారు. సరైన సిట్యుయేషన్ వస్తే ఆ మంకు పొరలు కరిగిపోతాయి. అయితే ఆ పొరలు త్వరలోనే తొలగుతాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు కారణం కరోనా వ్యాక్సిన్. అవును వ్యాక్సిన్ విషయమై ఇరు ముఖ్యమంత్రులు త్వరలోనే భేటీ అయ్యే అవకాశముంది.
కరోనా తెలుగు రాష్ట్రాల్లో కూడ విజృంభించింది. అటు కేసీఆర్, ఇటు జగన్ ఇద్దరూ చాకచక్యంగా ఆలోచించి కఠినంగా లాక్ డౌన్ అమలుచేసి వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయగలిగారు. కేసీఆర్ మొదట్లో తడబడి కోర్టు నుండి అక్షింతలు వేయించుకున్నా మెల్లగా కుదురుని వైరస్ వ్యాప్తికి అడ్డుకట్టలు వేయగలిగారు. అదే జగన్ అయితే మొదటి అడుగు నుండే సఫలమయ్యారు. నిబంధనల అమలుతో పాటు భారీ సంఖ్యలో రోజువారీ కోవిడ్ పరీక్షలు చేయడంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రోజుకు 60 నుని 70 వేల టెస్టుల వరకు చేశారు. ఇప్పుడు కట్టడి దశ దాటి నిర్మూలన ప్రక్రియ మొదలైంది. ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైంది.
దేశంలోనే కాదు ప్రపంచంలో కూడ అత్యధిక సంఖ్యలో వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయగల సామర్థ్యం హైదరాబాద్ కు ఉంది. అరబిందో ఫార్మా అభివృద్ధి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రస్తుతం వివిధ దశలలో ఉంది. భారత్ బయోటెక్, బయోలాజికల్ ఇ లిమిటెడ్ సంస్థ సొంతంగా టీకా అభివృద్ధి కోసం టెక్సాస్‌లోని బేలర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. డాక్టర్ రెడ్డీస్ హెటెరో వ్యాక్సిన్ తయారీకి వివిధ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వ్యాక్సిన్‌ను హైదరాబాద్ లో తయారుచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలా ప్రపంచానికి అధికమొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగల సత్తా భాగ్యనగరానికి ఉంది.
ఇక ఏపీలో ఈ పరిస్థితి లేదు. భారిగా ఖర్చు పెట్టి ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేయలేరు. ఒకవేళ చేయాలని పూనుకున్నా చాలా సమయం పడుతుంది. అందుఎక్ ముందుగా తెలంగాణ ప్రభుత్వం సహాయం తీసుకుని వ్యాక్సిన్ పొందాలని వైఎస్ జగన్ భావిస్తన్నారట. ఈ మేరకు త్వరలోనే జగన్ కేసీర్ ఇంటికి వెళ్లి భేటీ అవుతారని చెబుతున్నారు. ఒకవేళ భేటీయే జరిగితే కేసీఆర్ బేసిన్ల భేషజాలు పక్కనపెట్టి ఏపీకి తప్పకుండా వ్యాక్సిన్ సహాయం చేస్తారని ఆశించవచ్చు.