చంద్రబాబు నాయుడు రాజకీయాలు ప్రత్యర్థుల బలహీనతల మీద ఆధారపడి ఉంటే వైఎస్ జగన్ రాజకీయం సొంత బలం మీద బేస్ అయి ఉంటుంది. ఈ రెంటికీ చాలా తేడా ఉంది. చంద్రబాబు గెలవాలి అంటే ప్రత్యర్థి తప్పుచేయాలి, అదే జగన్ గెలవాలి అంటే ఆయనే పనిచేయాలి. ఇక్కడ చంద్రబాబు ఎదుగుదల ప్రత్యర్ధి చేతుల్లో ఉంటుంది. కానీ జగన్ గెలుపు ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఎంతైనా పరాన్నజీవి పరాన్నజీవే కదా. జగన్ ఎప్పుడు తప్పు చేస్తాడా ఎప్పుడు ఎక్కేద్దామా అని ఒకటిన్నర ఏడాదిగా ఎదురుచూసిన చంద్రబాబుకు ఎట్టకేలకు దేవాలయాల మీద దాడులు అంశం కలిసొచ్చింది. అదే ఆయనకు చుక్కాని అనిపించింది. ఇంకేముంది బలాన్నంతా కూడగట్టుకుని జగన్ సర్కార్ మీద యుద్ధానికి దిగారు.
చంద్రబాబు ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ దేవుళ్ల, దేవాలయాల వివాదాలను ఈ స్థాయిలో హైలెట్ చేయలేదు. మత ప్రాతిపదికన విమర్శలు చేయలేదు. కానీ ఇప్పడు చేస్తున్నారు. అందుకే ప్రజలకు కూడ ఆయన తీరు ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇలాగే వదిలేస్తే ఈ విషయాన్ని మరింత పెద్దది చేస్తారు. ఈ తరహా దాడికి కేవలం మాటలతో సంధానం చెబితే సరిపోదు. చేతుల్లోనే చూపించాలి. అందుకే జగన్ సూపర్ ప్లాన్ వేశారు. చంద్రబాబు పాలనలో కూల్చబడిన దేవాలయాలను ఎంచుకుని వాటి పునర్నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. రాహు – కేతు ఆలయం, సీతమ్మ పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, శనైశ్చర ఆలయం, బొడ్డు బొమ్మ, ఆంజనేయస్వామి ఆలయం ఇలా 8 ఆలయాలకు శంఖుస్థాపన చేశారు.
ఇంద్రకీలాద్రి కొండపై ఉన్న శ్రీదుర్గ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణకు రూ.70 కోట్లను కేటాయించారు. భీతితో తనను హిందూ ధర్మ విధ్వంసకారిగా చూపిస్తున్న చంద్రబాబుకు గట్టి సంధానం ఇచ్చినట్లయింది. అంతేకాదు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్ని గుళ్ళు కూలాయో ప్రజలకు గుర్తుచేస్తున్నారు కూడ. జగన్ వేసిన ఈ స్టెప్ ఇకపై దేవాలయాలు, దేవుళ్ళ విషయంలో చంద్రబాబు జగన్ మీద పర మతం, దేవుడి విశ్వాసాలను చూపిస్తూ విమర్శలు గుప్పించే వీలులేకుండా చేసిందనే అనుకోవాలి. ఇక చంద్రబాబు ఎప్పటిలాగే తన పాత పాటను అందుకోవాల్సిందే. తాము పోరాటం కాబట్టే ఆలయాలకు నిధులు కేటాయించబడ్డాయని క్రెడిట్ కొట్టేసే సెల్ఫ్ డబ్బాను మొదలుపెడతారు. అంతేకానీ జగన్ చేసిన పనిని మాత్రం మెచ్చుకోలేరు.