వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు చేస్తున్న విన్యాసాల గురించి రాష్ట్రంలో చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు వైసీపీ నాయకుల ప్రవర్తనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఖంగారు పడుతున్నారు. వైసీపీకి చెందిన ఆ ఎనిమిది మంది ఎంపీలు ఎక్కడ ఉన్నారని, అసలు వాళ్ళు ఏమి చేస్తున్నారని, వాళ్లకు పార్టీ వీడే ఆలోచనలు ఉన్నాయా అనే చర్చలు వైసీపీ నేతల మధ్య జరుగుతున్నాయి.
ఎవరా ఎనిమిది మంది ఎంపీలు?
వైసీపీ 22 స్థానాల్లో గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. 22 మంది లోక్ సభ సభ్యులు ఉన్నారు. వీరిలో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ ఇటీవల మృతి చెందారు. దీంతో ఈ సంఖ్య 21కి చేరింది. వీరంతా.. పార్లమెంటులో కనిపించాలి. అయితే వీరిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. సత్యవతి..(అనకాపల్లి) – గొట్టేటి మాధవి(అరకు) – రంగయ్య(అనంతపురం) కరోనా నేపథ్యంలో పార్లమెంటుకు వెళ్లడం లేదు. అలాగే కోటగిరి శ్రీధర్ అమెరికాలో ఉండటం, రఘురామ కృష్ణంరాజు రెబల్ గా మారటం వల్ల మొత్తం 16 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు మొత్తం 22 మంది పార్లమెంట్ లో కనిపించాలి కానీ కేవలం 14 మంది మాత్రమే కనిపిస్తున్నారు. మిగిలిన ఎనిమిది మంది ఎంపీలు ఎక్కడ ఉన్నారని జగన్ విచారణ చేస్తున్నారు.
బీజేపీలో చేరనున్నారా!
ఎంపీలు పార్లమెంట్ లో మాట్లాడాల్సిన విషయాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక మీటింగ్ పెట్టి మరీ వివరించారు. అయితే ఇప్పుడు ఆ ఎనిమిది మంది ఎంపీలు జగన్ మాటలను పట్టించుకోకుండా ఇలా కనిపించకుండా పోవడంతో వైసీపీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 8 మంది ఎంపీల పరిస్థితి ఏంటి? వారు ఎక్కడ ఉన్నారు? పార్టీకి దూరంగా ఉంటున్నారా? లేక ఏదైనా సొంత అజెండా పెట్టుకున్నారా? ఇప్పుడు ఈ సందేహాలే.. అటు ఢిల్లీలోనూ – ఇటు ఏపీలోనూ హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఎనిమిది ఎంపీలు ఢిల్లీలో బీజేపీ నాయకులతో టచ్ లో ఉన్నారని కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.