YS Jagan: జగన్ 2.0 చూడబోతున్నారు…. వెంట్రుక కూడా పీకలేరు… ఫైర్ అయిన జగన్?

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని తిరిగి ఆంధ్రకి వచ్చిన తరువాత వెంటనే ఈయన రాజకీయ కార్యకలాపాలలో బిజీ అయ్యారు. ఈ క్రమంలోనే బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థలతో కలిసి ఈయన భేటీ అయ్యారు ఈ భేటీలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించడమే కాకుండా వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో భరోసా ఇచ్చారు గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలకు మంచి చేయాలి అన్న ఉద్దేశంతోనే కార్యకర్తలను కాస్త దూరం పెట్టానని కానీ ఈసారి కార్యకర్తల కోసం జగన్ పనిచేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అంటూ మాట్లాడారు. పార్టీ కోసం ఎంతో కష్టపడిన మిమ్మల్ని దూరం పెట్టాను ఇప్పుడు చంద్రబాబు గెలిచిన తర్వాత మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఎన్ని బాధలు పెడుతున్నారో చూస్తున్నాను.

తిరిగి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టను ప్రతి ఒక్కరూ మీకు మంచి చేసిన వారిని చెడు చేసిన వారిని ఇద్దరినీ కూడా గుర్తుపెట్టుకోండి వారు ఎక్కడ దాక్కున్న శిక్ష అనుభవిస్తారని జగన్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జగన్ 2.O ఏంటో వారికీ అర్థమయ్యేలా చేస్తానని వాళ్లు నా కార్యకర్తల వెంట్రుకలు కూడా పీకలేరు అంటూ జగన్ మాట్లాడారు.

ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు ఉంటాయి కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు నా కష్టాన్ని మీరందరూ గుర్తు చేసుకోండి. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా రాజకీయంగా ఎదుగుతున్నాం అన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ తెలుగుదేశం ఇద్దరు కూడా నాపై తప్పుడు కేసులు పెట్టించి 16 నెలలు జైల్లో పెట్టించారు. జైల్లో పెట్టిన ఎవరు భయపడాల్సిన పనిలేదు మీ అందరికీ నేను భరోసా ఇస్తాను మీరందరూ అండగా ఉంటే మరో ముప్పై ఏళ్లు మనమే అధికారంలో ఉంటాము అంటూ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.