ప్రజల పక్షాన నిలవాల్సిన మీడియా పార్టీల పక్షాన నిలబడుతూ మీడియా యొక్క నైతిక విలువను మంట కలుపుతున్నారు. ఈరోజుల్లో ఉన్న మీడియా గురించి మాట్లాడుతూ నైతిక విలువల గురించి మాట్లాడకూడదు. మీడియా నైతిక విలువను విడిచిపెట్టి ఎంతో కాలం అవుతుంది. ఇప్పుడు ప్రతిపక్షాల పక్షాన కొన్ని మీడియా సంస్థలు, అధికార పక్షాన కొన్ని మీడియా సంస్థలు పని చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ కోసం పని చేస్తున్న మీడియా సంస్థలు వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తుంటే వైసీపీ కోసం పని చేస్తున్న మీడియా సంస్థలు టీడీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
హద్దులు దాటుతున్న పచ్చ మీడియా
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోయినా కూడా వైసీపీ ప్రభుత్వ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కేంద్రంతో సంప్రదింపులు జరపడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమిత్ షాను ఢిల్లీ వెళ్లి కలిశారు. అయితే దీనిపై కూడా టీపీడీ మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నాయని వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ అమిత్ షా వన్ టు వన్ ఇద్దరు మాత్రమే రహస్యంగా మాట్లాడుకున్నారు. అక్కడ మూడో మనిషికి తావులేదు. అయితే ఏదో లోపల సీక్రెట్ మైక్ పెట్టినట్టు ఇంత పచ్చి అబద్ధాలతో జగన్ కు క్లాస్ పీకాడని కథనాలు రాస్తున్నారు. ఇలా కథనాలు రాస్తున్న మీడియాపై వైసీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
పచ్చ మీడియాకు జగన్ బుద్ది చెప్పనున్నారా!
పచ్చ మీడియా తనపై ఎన్ని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నా కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు స్పందించలేదు. అసలు పట్టించుకోలేదు. అయితే గత కొన్ని రోజులుగా పచ్చ మీడియా యొక్క వైఖరి హద్దు మీరడంతో జగన్ త్వరలోనే బుద్ది చెప్పనున్నారని, ఈ మాట కోసమే వైసీపీ కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్నారని సమాచారం. పచ్చ మీడియా ప్రసారాలను నిలిపివేస్తూ జగన్ నిర్ణయం తీసుకుంటాడాని వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. రానున్న రోజుల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటే పచ్చ మీడియా సమాధి కావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.