Y.S.Jagan: పోలీసు సోదరులారా… మారిన జగన్ టోన్… తప్పు తెలుసుకున్నాడా?

Y.S.Jagan: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో పోలీసులను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో వారిపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి పోలీసుల గురించి ఇదివరకు మాట్లాడుతూ పోలీసులు కూటమి సర్కారుకు కొమ్ము కాస్తున్నారని, తప్పుడు కేసులతో అందరిని అరెస్టులు చేస్తున్నారని బెదిరించారు అయితే అధికారం ఎల్లకాలం ఒకరిదే ఉండదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కార్యకర్తల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న పోలీసుల సంగతి చెబుతా అంటూ వార్నింగ్ ఇచ్చారు.

పోలీసులు సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొస్తానని వారికి చట్ట ప్రకారం శిక్ష వేస్తానని తెలిపారు. అలాగే రోడ్డుపై బట్టలూడదీసి కొడతామంటూ పోలీసుల గురించి గతంలో జగన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం. అయితే ఇటీవల జగనన్న పర్యటనలో మాత్రం పోలీసుల పట్ల జగన్ టోన్ మార్చారని తెలుస్తోంది. రెంటపాళ్ల పర్యటన కానీ, బంగారుపాళ్యం పర్యటనలో కానీ పోలీసులను సోదరులారా అంటూ ఉద్దేశించి మాట్లాడుతున్నారు.

ఈ రోజు మీరు మమ్మల్ని కట్టడి చేస్తున్నారు. అయితే మీకు కూడా సమస్యలు ఉంటాయి. చంద్రబాబు ప్రభుత్వం మిమ్మల్ని కూడా మోసం చేస్తుంది. అపుడు పలికేవారు జగన్ అని గుర్తు పెట్టుకోండని సున్నితంగానే చెప్పారు. మీ పట్ల చంద్రబాబు చేసే మోసాల గురించి నేను రోడ్డుపైకి వచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తాను.అందువల్ల మీరు రూల్స్ ని దాటి వేరేగా వ్యవహరించవద్దు అని సూచించారు. అంతే కాదు వైసీపీని కట్టడి చేయాలని పెద్దలు కానీ ఉన్నత అధికారులు కానీ చెప్పినా మీరు మీ పద్ధతుల ప్రకారమే వెళ్లాలి అంటూ జగన్మోహన్ రెడ్డి పోలీసులకు సున్నితంగా తెలియచేయడం విశేషం. జగన్ ఇలా సుతిమెత్తగా పోలీసులకు సమాధానం చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి పోలీసులను తప్పుగా మాట్లాడితే ఇబ్బందులు తప్పవని తెలుసుకున్నారా అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.