ఫైర్ బ్రాండ్ రోజాను ఇరుకున పెట్టిన వైఎస్ జగన్.. ఊహించని షాక్‌లో ఆర్కే రోజా.. ? 

Roja

 

ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజాకి వైసీపీలో పవర్ తగ్గిపోతోందా అనే అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయట… ఈ మధ్య కాలంలో పార్టీలోనూ, నియోజక వర్గంలోనూ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందని అంటున్నారు కొందరు.. ఇకపొతే ఏపీలో భారీ ఎత్తున వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన పదవులను భర్తీ చేసిన విషయం తెలిసిందే.. అయితే రోజా వ్యతిరేక వర్గానికి చెందిన కేజే శాంతికి రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ పదవి ఇవ్వడం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారింది. ఈ పరిణామం రోజా అనుచరులకు మింగుడు పడడం లేదని సమాచారం.. కాగా విపక్షంలో ఉన్న నాటి నుంచి వైఎస్ జగన్ మీద ఈగ వాలినా ఒప్పుకోని రీతిలో ఫైర్ అయ్యే రోజాకు తాజాగా సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఎటూ పాలుపోని స్దితిలో ఉన్నారట..

గత కొంత కాలంగా వైసీపీ ఎమ్మెల్యే రోజాకు, మాజీ మున్సిపల్ చైర్మన్ కేజే కుమార్ వర్గాల మధ్య నగరిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇదే కాకుండా గతంలో కేజే అనుచరులు అనేక సందర్భాల్లో రోజాను అడ్డుకున్నారట, కారు అద్దాలు ధ్వంసం చేసే ప్రయత్నం కూడా చేయగా రోజా వారిపై ఫిర్యాదు చేశారు.. ఇదీ గాక గతంలో కేజే కుమార్ ఇంట్లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు ఎవరూ హాజరు కావొద్దంటూ పార్టీ కార్యకర్తలకు పంపిన ఆడియో సందేశం అప్పట్లో వైసీపీలో కలకలం రేపింది.

ఇలాంటి పరిస్దితుల్లో వైఎస్ జగన్, కేజే కుమార్ భార్య శాంతికి రాష్ట్ర కార్పొరేషన్ పదవిని కట్టబెట్టడంపై రోజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మంత్రులు కావాలని తన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ పెద్దిరెడ్డి, నారాయణస్వామిలపై తీవ్ర అసహనంతో ఉన్నారట.. ఇలా తాజాగా నగరిలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో ఇక్కడి వాతావరణం మరోమారు వేడెక్కగా, భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో అన్న ఆసక్తి రాజకీయవర్గాలలో నెలకొందట..