ఆ సర్వే జగన్ టేబుల్ మీదకి వచ్చింది .. ఓపెన్ చేయగానే జగన్ కూడా షాక్ అయ్యాడు ?

Ys Jagan

 

ఈ కాలచక్ర భ్రమణంలో ఎన్ని మార్పులు జరుగుతున్నా కాలం ఆగడం లేదు, అలలకు అలుపు రాదు అన్నది నిత్య సత్యం.. అలాగే దేశాన్ని గానీ, రాష్ట్రాన్ని గానీ పాలించే నాయకులు తమ పనిని సక్రమంగా అలుపు అనేది లేకుండా నిర్వహిస్తే దేశ, రాష్ట్ర పరిస్దితులు దేహీ అనే స్దిలోకి జారిపోవన్నది అక్షర సత్యం.. ఇక రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అనేది ఒక మహా యజ్ఞం లాంటిదంటారు.. ఈ విషయం ఎందుకు ప్రస్తావించవల్సి వచ్చిందంటే.. ఏపీలో పార్టీ అంటే టీడీపీ అని ప్రజల్లో బలంగా నాటుకుపోయి వున్న భావజాలాలను ఖండించి, టీడీపీని నామరూపాలు లేకుండా అల్లకల్లోలం చేస్తున్న పార్టీ ఏదంటే వైసీపీ అని చెప్పక తప్పదు.. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు వైఎస్ జగన్ పై నెగిటివ్ ముద్ర అధికంగా ప్రచారం అయ్యిందన్న విషయం తెలిసిందే..

ఇక వైఎస్సార్ మరణం తర్వాత తన ఇమేజీని పాజిటివ్ గా మార్చుకోవడమే కాకుండా, పలు సంక్షోభాలను ఎదిరించి నిలబడ్డ నేత దేశంలోనే వైఎస్ జగన్ ఒక్కరే అంటే ఆశ్చర్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఎవరినో కూలదోసో అధికారంలోకి రాలేదు. ఇకపోతే వైఎస్ జగన్ పదహారు నెలల పాలనను దూకుడుగానే సాగిస్తున్నారు.. తాను ఇచ్చిన హామీలను చకచకా నెరవేరుస్తూ ఒక కచ్చితమైన యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్లుతున్నారు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా, ఏపీని సంక్షేమ రాజ్యంగా చేయడంతో వైఎస్ జగన్ కి సాటి లేరన్న పేరు కూడా సంపాదించుకున్నారు. మరోవైపు ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో కూడా ఈ వ్యాధి విషయంలో ప్రజలకు నిత్యం వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రణాళిక రచించడమే కాదు, ఎక్కడా సంక్షేమం ఆపకపోవడం వైఎస్ జగన్ కి అతి పెద్ద ప్లస్ పాయింట్.

అయితే అదే సమయంలో సమాజంలో ఉన్న అనేక వర్గాలకు తాను చేపట్టిన సంక్షేమ పధకాలు పూర్తిగా అందుతున్నాయ లేదా అన్నది జగన్ ఆరా తీస్తే మాత్రం షాకింగ్ విషయాలు తెలిసాయట.. అదేమంటే వైఎస్ జగన్ పాదయాత్రలో చెప్పిన పధకాలు కొన్ని చోట్ల అసలు అమలుకు నోచుకోక పోవడంతో చాలా సీరియస్ అయ్యారని టాక్. దీంతో వెంటనే అలెర్ట్ అయి అట్టడుగు స్థాయి వరకూ సంక్షేమ పధకాలు చేరాలని, ఆర్డర్ కూడా వేశారని అంటున్నారు.. తాను ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలు ప్రతీ ఒక్కరికీ అందడమే తన లక్ష్యమని ఈ విషయంలో ఎలాంటి అవినీతి జరిగిన సహించేది లేదని గట్టిగానే చెప్పారట.. మొత్తానికి వైఎస్ జగన్ టేబుల్ మీదకి వచ్చిన ఆ సర్వే నివేదికల పుణ్యమా అని సంక్షేమ పధకాల అమలు ఇక నుండి మరింత పకడ్బంధీగా సాగుతుందని చర్చ నడుస్తుందట ప్రస్తుతం ఏపీలో..