Y.S.Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గత అసెంబ్లీ ఎన్నికలలో ఘోర ఓటమి పాలు అయ్యారు 2019 ఎన్నికలలో 151 స్థానాలలో సింగిల్గా పోటీ చేసే విజయం సాధించిన ఈయన గత ఎన్నికలలో కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించారు. దీంతో తన ఓటమికి గల కారణాలు ఏంటి అని విశ్లేషించుకుంటూ వచ్చారు.
ఇక జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆయన చుట్టూ ఉన్న కోటరీనే అంటూ ఇటీవల వైసిపి పార్టీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నేత విజయసాయిరెడ్డి వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉందని ఆ కోటరీ కారణంగా ఆయన పరిస్థితి ఇలా ఉందని తెలిపారు. ఎప్పుడైతే కోటరీ నుంచి బయటకు వస్తారో అప్పుడే గొప్ప నాయకుడు అవుతారని తెలిపారు.
ఇలా జగన్మోహన్ రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కి మాత్రమే పరిమితం కావటం వల్ల గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పట్ల ఎంత వ్యతిరేకత ఏర్పడిందో కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉండిపోయారు. అయితే ప్రస్తుతం ఓటమిపాలు కావడంతో తిరిగి తన పార్టీని రాష్ట్రవ్యాప్తంగా బలోపేతం చేసుకోవడానికి ఈయన వ్యూహాలు రచిస్తున్నారు.
తిరిగి బూత్ స్థాయి నుంచి పార్టీని పూర్తిస్థాయిలో బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇందులో భాగంగానే ప్రజా దర్బార్ నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు ఇప్పటివరకు కేవలం పులివెందుల నియోజకవర్గం లో మాత్రమే ఈయన ప్రజాదర్బార్ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకునేవారు అయితే ఇకపై తాడేపల్లిలో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇలా ప్రజా దర్బార్ సర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నింటిని కూడా నిర్వహిస్తున్నారు ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు వారి సమస్యలను తెలియజేయటానికి వీలుగా ఉంటుందని అప్పుడు రాష్ట్ర పరిస్థితుల పట్ల కూడా ఒక అవగాహన ఉంటుందని జగన్ భావించినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి ఇలాగే ప్రజాధర్బార్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకునేవారు ఇప్పుడు జగన్ సైతం రూటు మార్చి తన తండ్రి బాటలోనే పయనిస్తున్నారని తెలుస్తోంది.