జిల్లా కలెక్టర్లందరికీ ఫుల్ క్లాస్ పీకిన జగన్.. అసలేమైంది, ఎందుకంత కోపం ? 

Ys jaganmohan reddy
కరోనాపై పోరులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనేక రకాల వ్యూహాలను అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.  భారీ సంఖ్యలో టెస్టులు చేస్తుండటంతో  ప్రతిరోజూ వేలాది పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి.  ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతోంది.  దీంతో సీఎం మరింత అలర్ట్ అయ్యారు.  నిత్యం నివారణ చర్యలు, వైద్య సేవలపై సమీక్షలు జరుపుతున్నారు.  వైరస్ ఒకవైపు ఇబ్బంది పెడుతుంటే మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల వైఖరి దారుణంగా తయారైంది.  వైరస్ సోకి ఆసుపత్రులకు వస్తున్న రోగుల నుండి అధిక మొత్తంలో ఫీజులు గుంజుతున్నారు.  ఒక్కోసారి అనుమానంతో ఆసుపత్రికి వచ్చిన వారిని వైరస్ లేకున్నా అడ్మిట్ చేసుకుని డబ్బులు గుంజుతున్నారు.  గత నాలుగైదు నెలల్లో ప్రైవేట్ ఆసుపత్రుల దందాకి బలైన బాధితులు అనేక మంది ఉన్నారు.  
YS Jagan serious instructions to district collectors
 
ఇక ప్రైవేట్ హాస్పిటళ్లకు వెళ్లలేక ప్రభుత్వ ఆసుపత్రులకు వెళుతుంటే అక్కడి పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి.  కొన్ని చోట్ల కనీస సదుపాయాలు లేక, బెడ్లు దొరక్క నానా యాతన పడుతున్నారు రోగులు.  ప్రతిరోజూ ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి.  వీటి మీదే సీఎం బాగా సీరియస్ అయ్యారు.  తాజాగా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన వైఎస్ జగన్ గతంలో కంటే గట్టిగా రియాక్ట్ అయ్యారట.  ముఖ్యంగా ప్రైవేట్ యాజమాన్యాల తీరు మీద ఉక్కుపాదం మోపాలని కలెక్టర్లందరికీ సీరియస్ ఆదేశాలిచ్చారట.  భారీ ఫీజులు వసూలు చేసే ఆస్పత్రులకు భారీ మూల్యం తప్పదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకే ఫీజులు వసూలు చేయాలని తెలిపారు. 
 
కరోనా సోకి ఆసుపత్రికి వస్తే అరగంటలోపు బెడ్ కేటాయించాలని, ఈ విషయంలో పర్యవేక్షణ బాధ్యత పూర్తిగా కలెక్టర్లదేనని స్పష్టం చేశారు.  కరోనా వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్లకి కాల్ చేస్తే ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని, అలసత్వం తగదన్నారు.  ఇదే సమీక్షలో వరదల మీద కూడా మాట్లాడుతూ సెప్టెంబర్ 7లోపు వరద నష్టాన్ని అంచనా వేయాలని, గోదావరి వరద ముంపు ప్రాంతాల్లోని బాధితులకు రూ.2 వేల ఆర్థిక సహాయం అందేలా చూడాలని, అలాగే ముంపు బాధితులకు ప్రతీ నెలా అందించే రేషన్‌కు అదనంగా మరో 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో పామాయిల్, కిలో ఉల్లి, కిలో బంగాళదుంపలు, 2 లీటర్ల కిరోసిన్ లాంటి అత్యవసరాలను సెప్టెంబర్ 7 లోపు అందించాలని అందించాలని ఆదేశించారు.