జ‌గ‌న‌న్న ఇసుక సాప్ట్ వేర్..ఆన్ లైన్ లోనూ మాఫియా!

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిరాగానే ఇసుక మాఫియాకి అడ్డుక‌ట్ట వేసారు. అక్ర‌మ త‌ర‌లింపుల‌ను ఎక్క‌డిక్క‌డ క‌ట్ట‌డి చేసి ప్ర‌త్యేక పోర్ట‌ల్ ని సిద్దం చేసారు. కేవ‌లం ఆన్ లైన్ బుకింగ్స్ ద్వారానే ఇసుక అమ్మ‌కాలు చేప‌ట్టింది. అందుకోసం ప్ర‌త్యేకంగా ప్ర‌భుత్వ‌మే ఓ సాప్ట్ వేర్ సిద్దం చేసింది. రోజులో 15 నిమిషాల పాటే ఆన్ లైన్ బుకింగ్ చేసుకునేలా సాప్ట్ వేర్ ని రూపొందించారు. ఆ ప‌దిహేను నిమిషాల్లో ఎన్ని బుకింగ్ లు జ‌రిగితే అంత మందికే ఇసుక దొరుకుతుంది. లేదంటే మ‌ళ్లీ మ‌రుస‌టి రోజు వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే. ఈ ప్రాస‌స్ లో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం కొన్ని విమర్శ‌ల్నే నెత్తిన వేసుకోవాల్సి వ‌చ్చింది. భ‌వ‌న నిర్మాణ‌ కార్మికులు ఆత్య‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం వంటి సంఘ‌ట‌న‌లు ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు భంగం క‌ల్గించాయి.

ప్ర‌భుత్వ యంత్రాంగం సాప్ట్ వేర్ అందుబాటులోకి తీసుకొచ్చి స‌చివాల‌యాల ద్వారా బుకింగ్స్ అందుబాటులోకి తెచ్చిన త‌ర్వాత ఇబ్బందులు త‌గ్గాయి. అయితే 15 నిమిషాల వ్య‌వ‌ధే ఇవ్వ‌డంతో ఇప్ప‌టికీ కొన్ని స‌మ‌స్య‌లైతే ఎదుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇదే అదునుగా భావించిన ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ ప్ర‌భుత్వం రూపొందించిన సాప్ట్ వేర్ కి డూప్లికేట్ సాప్ట్ వేర్ ని త‌యారు చేసి ల‌క్ష‌లు సంపాదించారు. కామారారెడ్డికి చెందిన ఇద్దరు బ్ర‌ద‌ర్స్ సిపోడియా ఆదేశ్, సిపోడియా హ‌ర‌నాథ్. ఓ స్నేహితుడి ఇంట్లో ఉంటూనే క‌మీష‌న్ల రూపంలో ల‌క్ష‌ల్లో గ‌డించారు. గూగుల్ , యూ ట్యూబ్ లో శోధించి పేటీఎం యాడ్ లో `ఆటోఫిల్` అనే సాప్ట్ వేర్ ని గుర్తించి దాన్ని ఆన్ లైన్లో విక్ర‌యించి 5 ల్యాప్ టాప్ లో ఇన్ స్టాల్ చేసి..త‌మ బ్యాంక్ ఖాతా వివ‌రాల్ని సేమ్ ప్ర‌భుత్వ‌ పోర్ట‌ల్ లా ఉండే మ‌రో పోర్ట‌ల్ ని పొందుప‌రిచారు.

ఇలా రోజు ఐదు ల్యాప్ టాప్ లో 15 నిమిషాల్లోబోలెడ‌న్ని ఆర్డ‌ర్ల‌ను క‌మీష‌న్ల రూపంలో బుక్ చేసి ల‌క్ష‌లు సంపాదించారు. ఇసుక మాఫియా గ్యాంగ్ వీళ్ల ఖాతాల ద్వారానే రోజు బుకింగ్ లు చేసిన‌ట్లు తెలిసింది. వాళ్ల‌తో ప‌రిచ‌యాలు పెర‌గ‌డంతో క‌మీష‌న్లు కూడా పెరిగాయి. త్వ‌ర‌లోనే అద‌నంగా మ‌రో ఐదు కొత్త ల్యాప్ టాప్ ల‌ను తీసుకుని బుకింగ్స్ ఇంకా పెంచాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే ఈ డూప్లికేట్ సాప్ట్ వేర్ ని రాచ‌కోండ ఎస్ వోటీ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు బ‌ట్ట బ‌య‌లు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ ఇద్ద‌రి బ్ర‌ద‌ర్స్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో ఆన్ లైన్ లోని కొత్త ర‌కం మాఫియా ఒక‌టి త‌యారైన‌ట్లు తెలుస్తోంది.