టీడీపీ విషయంలో వైఎస్ జగన్ మౌనం వెనక ఉన్న వ్యూహం తెలిస్తే షాకవడం ఖాయం.. ?

 

ఎంత ఎదిగిన ఒదిగుండటమే బుద్దిమంతుల లక్షణం అంటారు పెద్దలు.. ఇదే విషయాన్ని వైఎస్ జగన్ నిరూపిస్తున్నాడట.. అసలు రాజకీయ అనుభవం లేదు.. అలాంటిది సీయం కుర్చిలో కూర్చోగానే సరిపోదు.. నాయకులను బుజ్జగిస్తూ, పార్టీ బలహీన పడకుండా, ప్రతిపక్షాన్ని ఎదిరిస్తూ వారు పెట్టే చికాకుల్ని ఓపికగా భరిస్తూ ఉండాలి.. ఆ ఇదంతా వైఎస్ జగన్ వల్ల ఏం అవుతుంది.. ఎంత స్పీడ్‌గా సీయం అయ్యాడో అంతే స్పీడ్‌గా మాజీ సీయం అవుతాడని ఆనాడు టీడీపీ వారు అనుకున్న మాటలు.. కానీ వారు ఊహించని విధంగా తన పాలనను కొనసాగిస్తూ, రాజకీయంగా ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా అవన్ని తన బుద్ధి బలంతో చిత్తు చేస్తూ సీయం అంటే ఇలా ఉండాలని అనిపించుకుంటున్న వైఎస్ జగన్ తీరు ఇప్పటికి ఎవరికి అర్ధం కాదట..

ఇక చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్‌ను ఆయన ఫ్యామిలీని ఎన్ని తిప్పలు పెట్టారో అందరికి తెలిసిందే.. కానీ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్, చంద్రబాబు విషయంలో మాత్రం ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా చాలా వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నాడట.. ఈ దశలో తమ చేతికి మట్టి అంటకుండా, తమ రాజకీయ శత్రువును దెబ్బ తీయడం ఎలాగో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను చూసి తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే అనేలా చేస్తున్నారట..

ఇకపోతే తనపైన, తమ పార్టీ నాయకుల పై అదేపనిగా విమర్శలు చేస్తూ, అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్న రాజకీయ ప్రత్యర్థులందరి విషయంలోనూ వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తూ వస్తున్నా తాను చేయవలసిన పనిని పూర్తి చేస్తున్నాడట.. ఎలాంటి తొందరపాటు లేకుండా అవినీతి వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలను పక్కాగా సిద్ధం చేసుకునే, వైఎస్ జగన్ ముందుకు వెళ్లుతున్నారని, ఏమాత్రం పొరపాటు చేసిన ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందనే నింద మోయవలసి వస్తుందని ఆలోచనతో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట..

ఇదిలా ఉండగా టీడీపీలో పెద్ద తలకాయ అయిన చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చినా, దానికి తగిన ఆధారాలు ఉన్నా, వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా తొందరపడటం లేదు. ఒకవేళా అలా చేస్తే తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ సానుభూతి సంపాదిస్తుంది.. కానీ వారి అవినీతి వ్యవహారాలపై విచారణ జరగాలి. వీరంతా అరెస్టు అవ్వాలి.. ఇదంతా తమ ప్రమేయం లేకుండానే జరిగిపోవాలి అనే ఉద్దేశంలో ఉన్న వైఎస్ జగన్ ఆ వ్యవహారాల్లోకి కేంద్రాన్ని తెలివిగా లాగుతున్నారట.

ఒకవైపు టీడీపీ, బీజేపీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న సమయంలో నోరు జారి తొందరపడితే నష్టపోయేది టీడీపీనే.. అలాగని వైసీపీ పై ఎదురు దాడికి దిగలేని పరిస్దితి.. ఇలా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఏపీలోకి దించి తమ రాజకీయ శత్రువుల అందరిని భయపెట్టే విధంగా వైఎస్ జగన్ ప్రణాళిక రూపొందిస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు.. మరి ఈ విషయం గమనిస్తే టీడీపీ నాయకుల పరిస్దితి ఏంటో..