Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తాడేపల్లిలో ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమా డైలాగుల గురించి మాట్లాడారు అయితే గత కొద్ది రోజుల క్రితం పల్నాడు పర్యటనలో భాగంగా కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన డైలాగులతో ఫ్లెక్సీలను ప్రదర్శించారు. అప్పటినుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా సినిమా డైలాగులు గురించి తెలియజేశారు.
గుమ్మడికాయ దొంగలు అంటే భుజాలు తడుముకున్నట్లు సినిమా డైలాగులతో ఫ్లెక్సీలు పెట్టిన సినిమా డైలాగులు మాట్లాడిన వెంటనే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది? అలాంటప్పడు సినిమాలు తీయడం ఎందుకు?. అసలు సినిమా డైలాగులతో చంద్రబాబుకి వచ్చే నష్టం ఏంటి?. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో అంతకంటే దారుణమైన డైలాగులు ఉంటున్నాయి వాటి సంగతి ఏంటి? ఇదే ప్రజాస్వామ్యమా? అంటూ ప్రశ్నించారు.
ఏపీలో సినిమా డైలాగులను ప్రదర్శించారని.. ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు. మరో 131 మందికి నోటీసులు ఇచ్చారు. రోజంతా పోలీస్ స్టేషన్‌లలో కూర్చోబెట్టి వేధిస్తున్నారు. ఛార్జ్‌షీట్‌లో అదర్స్ అని పెట్టి.. వాళ్లకు కావాల్సిన వాళ్లను అందులో ఇరికించి ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో మంచి చేసి మనసులు గెలుచుకుని తగ్గేదే లే(మేనరిజం ప్రదర్శించారు) అను అది సత్తా..అంతేతప్ప అన్యాయమైన పాలన చేస్తూ .. ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దారుణమని వైఎస్ జగన్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
