బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి ని కలిసిన వైఎస్ జగన్..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దావోస్ పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే. దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వైయస్ జగన్ కార్యక్రమాలలో సమావేశం అవుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం తో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

ఈ సందర్భంగా దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు మూడో రోజు కార్యక్రమంలో భాగంగా బహ్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రి సల్మాన్ అల్ ఖలీఫా తో జగన్ సమావేశం అయ్యాడు. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు గురించి చర్చలు చేసినట్లు తెలుస్తుంది.