అన్ని అస్త్రాలను సిద్దం చేసిన జగన్.. 2021 కూడ ఆయనదే 

YS Jagan master plan for 2021 
వైసీపీ సారథి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జనంలో రోజు రోజుకూ తన పరపతిని పెంచుకుంటూ పోతున్నారు.  సంక్షేమ పథకాల అమలుతో నిత్యమా జనం తనవైపే చూసేలా చేస్తున్నారు.  ఏ నాయకుడికైనా, పార్టీకైనా అందునా అధికారంలో ఉన్నవారికి నిత్య ప్రచారం చాలా అవసరం.  ఎప్పుడూ ప్రజల నోళ్ళలో నానుతూ ఉండాలి.  ఓటర్లు నాయకుల గురించి ఆశ్చర్యంగా మాట్లాడుకోవాలి.  అప్పుడే వారికి భవిష్యత్తు ఉంటుంది.  ఈ సత్యాన్ని బాగా వంటబట్టించుకున్న జగన్ 24 గంటలు అదే పనిలో ఉంటున్నారు.  ఈ పథకం ఆ పథకం అంటూ వేల కోట్లు  కుమ్మరిస్తున్నారు.  2019, 2020 సంవత్సరాల్లో సుమారు 50 వేల కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేసి దేశవ్యాప్తంగా హైలెట్ అయిన జగన్ సర్కార్ కొత్త సంవత్సరం 2021లో కూడ అదే పని చేస్తోంది.  
 
YS Jagan master plan for 2021 
YS Jagan master plan for 2021
గత రెండేళ్లలో పిలిస్తే ఈ ఏడాది చాలా ముఖ్యమైనది.  తిరుపతి ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఈ సంవత్సరంలోనే జరగనున్నాయి.  ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులకు అస్సలు అవకాశం ఇవ్వకూడని జగన్ భావిస్తున్నారు.  అందుకే ప్రతిపక్షాలను తొక్కిపట్టే అస్త్రాలను రెడీ చేశారు.  గత ఏడాది ఆరంభంలో  ప్రకటించిన ఉచిత పట్టాల పంపిణీ కార్యక్రమం కాలయాపన మూలంగా సంవత్సరం ఆఖరుకు మొదలైంది.  ఈ కాలయాపనకు కారణం అధికార వర్గమేనా లేకపోతే కోర్టులకెక్కి స్టేలు తీసుకొచ్చిన ప్రతిపక్షమా అనేది పక్కనపెడితే 2021ని పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం అనే భారీ సెటప్ పెట్టుకుని ఆరంభించింది వైసీపీ.  ఈ కార్యక్రమం అంచనా వ్యయం లక్ష కోట్లకు దగ్గరే.  మరి అంత పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ప్రొజెక్షన్ ఎలా ఉండాలి.  ఆకాశాన్ని తాకాలి. 
 
పక్కా ప్రణాళిక మేరకు ఈ కార్యక్రమాన్ని విడతలు విడతలుగా ప్లాం చేశారు.  రాష్ట్రం మొత్తం ఒకేసారి పట్టాలు ఇచ్చేయకుండా దశలవారీగా ఒకటవ జాబితా, రెండవ జాబితా అంటూ లబ్దిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇక ఇళ్ల నిర్మాణం సంగతైతే చెప్పనక్కర్లేదు.  ఒకటవ దఫాలో 15 లక్షలు, రెండవ దఫాలో 12 లక్షల ఇళ్ళు కట్టిస్తారట.  ఇళ్ల నిర్మాణం అంటే ఎంతకాలం సాగుతుందో చెప్పాల్సిన పనిలేదు.  జిల్లాల వారీగా నాయకులకు షెడ్యూళ్లు వెళ్లిపోయాయి.  ఎప్పుడు ఎక్కడ ఎవరెవరు జగనన్న కాలనీలను ప్రారంభించాలో ముందే చెప్పేశారు.  ఆ ప్రకారమే నిర్మాణాలు జరుగుతాయి.  విశ్లేషకుల అంచనా మేరకు జగన్ పదవీ కాలం పూర్తయ్యే సమయానికి ఇళ్ల నిర్మాణం ముగుస్తుందట.  
 
అంటే ఈ పనులు నిత్యం జనంలో ఉంటూనే ఉంటాయి.  ఈ ఏడాది మొత్తం పూర్తిగా సఖుస్థాపనలు, పనులు ప్రారంభం, పట్టాల పంపిణీతోనే హంగామా చేయనున్నారు అధికార పార్టీ శ్రేణులు.  పూర్తైన ఇళ్లన్నింటికీ ఒకేసారి కాకుండా దశల వారీగా ప్రారంభోత్సవం చేస్తారు.  గృహప్రవేశాలకు కూడ ప్రత్యేక ఏర్పాట్లు ఉండినా ఉండొచ్చు.  అలా ఈ 2021 మొత్తం జన్నామస్మరణతో రాష్ట్రం దద్దరిల్లేలా ప్లాన్ చేశారన్నమాట.