రెవెన్యూ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఎదో ఒక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నాడు. రెవెన్యూ కార్యాలయాల్లో జరుగుతున్న మోసాలను అడ్డుకోవడానికి కేసీఆర్ విఆర్వో వ్యవస్థనే రద్దు చేశారు. అలాగే ఇప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా రెవెన్యూ కార్యాలయాల్లో జరిగే అక్రమాలను అరికడుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
గ్రామాల్లో, పట్టణాల్లో సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులను ప్రజలముందుకు తెచ్చారు. సచివాలయాల్లో పనిచేసేందుకు గ్రేడ్-2 వీఆర్వోలను నియమించి పరోక్షంగా అప్పటివరకూ అధికారాలు వెలగబెడుతూ వచ్చిన గ్రేడ్-1 వీఆర్వోలకు చెక్ పెట్టారు.
మరోవైపు గ్రామ సచివాలయాల్లోనే వీఆర్వోలకు కూడా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ సీసీఎల్ఏ రెండు రోజుల క్రితం ఉత్తర్వులిచ్చింది. దీంతో గ్రేడ్-1 వీఆర్వోలకు కూడా బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అయింది. ఎమ్మార్వో ఆఫీస్ లకు వద్దంటున్నారు, సచివాలయాలకు రాకపోతే ఊరుకునేలా లేరు. దీంతో గ్రామాల్లో పెత్తనం చెలాయించిన వీఆర్వోలంతా ఇప్పుడు సచివాలయాల డ్యూటీలకు వెళ్తున్నారు.నిర్దిష్ట పనిదినాల లోపు రైతులు పెట్టుకున్న అర్జీ పరిష్కారం కాకపోతే.. సరైన కారణం చెప్పాలి, లేకపోతే కచ్చితంగా ఆ పని చేసి పెట్టాలి. ఈ నియమాలన్నిటితో ఏపీలో రెవెన్యూ వ్యవస్థలో సంపూర్ణ ప్రక్షాళణ మొదలైంది. కేసీఆర్ లా జగన్ నేరుగా కాకుండా పరోక్షంగా అక్రమాలకు అడ్డుకట్ట వేశారు. రైతులను వేదించుకున్న అధికారులు ఇప్పుడు ఖచ్చితంగా తమ విధులను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే రైతులకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.