YS Jagan: సక్సెస్ అవుతున్న జగన్ మాస్టర్ ప్లాన్… వైసీపీలకి ముగ్గురు సీనియర్ నాయకులు!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సాధించారు అయితే 2024 వ సంవత్సరంలో కూడా జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీని సొంతం చేసుకుంటారని భావించారు. ఇక జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యారు.

ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమిపాలు కావడంతో ఎంతో మంది కీలక నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చారు. చివరికి విజయసాయిరెడ్డి కూడా ఈ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటికీ కూడా జగన్ పెద్దగా స్పందించలేదు. రాజకీయాలలో ఉండాలి అంటే క్యారెక్టర్ ఎంతో ముఖ్యమని, పాత వాళ్ళు వెళితే కొత్త వాళ్ళు వస్తారు. ఈ పార్టీ నాయకులతో కాదని ప్రజలు దేవుడి ఆశీస్సులతో నడుస్తోంది అంటూ జగన్ మాట్లాడారు.

ఇలా పార్టీకి చెందిన ఎంతో మంది కీలక నేతలు పార్టీని వీడి బయటకు వస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే తిరిగి పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం కోసం ఈయన ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సమయంలో కొంతమంది నేతలకు ఈయన మంత్రి పదవులు ఇచ్చారు.

ఇలా రాజశేఖర్ రెడ్డి హయామంలో కీలక రాజకీయ నాయకులుగా కొనసాగిన కొంతమందిని తిరిగి తన పార్టీలోకి ఆహ్వానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే సింగనమల కాంగ్రెస్ పార్టీ నాయకుడు శైలజనాథ్ వైసీపీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేవలం శైలజనాథ్ మాత్రమే కాకుండా మరో ఇద్దరికి నేతలు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారని తెలుస్తోంది.

సాకే శైలజనాథ్ తో పాటు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు లాంటివారు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే వీరు అధినేత జగన్ తో చర్చలు కూడా జరిపారు. వైసీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇలా సీనియర్ నాయకులందరిని ఆహ్వానిస్తూ తిరిగి తన పార్టీనా అధికారంలోకి తీసుకొచ్చేలా జగన్ సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు అయితే ఇందులో ఈయన సక్సెస్ అవుతున్నారని చెప్పాలి.