పొగడ్తల మీద కాదు.. జగన్ ఫోకస్ పెట్టాల్సింది వైఫల్యాలపైన.!

Ys Jagan Has To focus On Failures..

Ys Jagan Has To focus On Failures..

రాజకీయాల్లో భజన బృందం అనేది ఎప్పుడూ వుంటూనే వుంటుంది. అధికారంలో వున్నోళ్ళకు ఇది ఇంకాస్త ఎక్కువ. వైసీపీ ఇందుకు అతీతమేమీ కాదు. అధినేత మెప్పు కోసం ‘ఆల్ ఈజ్ వెల్..’ అని చెబుతుంటారు వైసీపీ ముఖ్య నేతలు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితాన్నే తీసుకుంటే, వైఎస్ జగన్ అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాల్ని బట్టి, విపక్షాలకు డిపాజిట్ కూడా రాకూడదు. కానీ, తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. జగన్ వేసిన అంచనా ఐదు లక్షల మెజార్టీ. కానీ, అందులో సగం మాత్రమే మెజార్టీ వచ్చింది. అంటే, ఇక్కడ అధికార పార్టీ నైతిక పరాజయాన్ని మూటగట్టుకుందని అనుకోవాలేమో. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ఫేక్ ఓటింగ్ జరిగిందనేది నిర్వివాదాంశం. అయినాగానీ, అధికార పార్టీ ఆశించిన మెజార్టీ రాకపోవడమేంటి.? సరే, ఆ సంగతి పక్కన పెడితే, చాలా సంక్షేమ పథకాల విషయాకు సంబంధించి కింది స్థాయిలో బోల్డన్ని విమర్శలున్నాయి.. వైఫల్యాలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. ఇవన్నీ ఇప్పుడు బాగానే మ్యానేజ్ చేసుకోగలుగుతుంది అధికార పార్టీ. కానీ, సాధారణ ఎన్నికలొస్తే అప్పటికప్పుడు ఈక్వేషన్స్ మారిపోతాయి.

కింది స్థాయిలో నేతలు ఏం చేస్తున్నారో అధినేత తెలుసుకోవాల్సిందే. అలా చంద్రబాబు తెలుసుకోకనే, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఆ పరిస్థితి వైసీపీకి రాకూడదంటే, ప్రభుత్వం తెరపైకి తెస్తున్న సంక్షేమ పథకాల పట్ల వినిపిస్తోన్న సానుకూలత గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, వైఫల్యాలు ఏమైనా వున్నాయా.? అన్నదీ తెలుసుకోవాల్సిందే. ఆ బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రి మీదనే వుంది. పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో పార్టీకి ఏకపక్ష విజయాన్ని అందించడంలో సత్తా చాటేశామనుకుంటోన్న వైసీపీ ముఖ్య నేతలు, తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ ఓటు బ్యాంకుని చెదరగొట్టలేకపోవడంపై పెదవి విప్పలేని పరిస్థితి. రెండేళ్ళ పాలన పూర్తయిన దరిమిలా, పార్టీ పరమైన కార్యక్రమాలపైనా జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టాలి.