ముందస్తుపై వైఎస్ జగన్ వెనుకడుగు.?

ముందస్తు ఎన్నికలకు వెళదామంటూ పార్టీ శ్రేణులకు గతంలో సంకేతాలు పంపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు చేస్తుంది.? కేంద్రానికి అవసరమైన మేర వైసీపీ సహాయ సహకారాలు అందిస్తున్న మాట వాస్తవం. రాష్ట్రానికి అవసరమైనప్పుడల్లా కొత్త అప్పులు చేసుకోవడానికి కేంద్రమూ వెసులుబాటు కనిపిస్తోంది.
వైసీపీకి ఎదురే లేదు.!

విపక్షాలు ఎలాగూ పుంజుకునే అవకాశం లేదని వైసీపీ బలంగా నమ్ముతోంది. ఈ పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలు వెళ్ళడం వల్ల కొత్త ప్రయోజనం, కొంత నష్టం కూడా వుంటుందని వైసీపీ భావిస్తోందట. ఎంతోకొంత ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో, 2019 ఎన్నికల నాటి మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతే.. వ్యవహారం తేడా కొట్టేస్తుంది.

ఈ నేపథ్యంలోనే, వైఎస్ జగన్ అత్యంత వ్యూహాత్మకంగా ముందస్తు ఆలోచనలపై వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని వైసీపీ నేతలు కొందరు తెగేసి చెబుతుండడం వెనుక అసలు కారణం ఇదే.

అయితే, ఒకవేళ జాతీయ స్థాయిలో ముందస్తు ఎన్నికల హంగామా ఏమైనా తప్పదనుకుంటే మాత్రం, వైసీపీ కూడా అదే బాటలో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.