ఏపీలో నివసిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలకు మేలు చేకూరేలా ఆ రాష్ట్ర సీయం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన పధకం అందరి మన్ననలు పొందుతుందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో మాత్రం చాలా వరకు ముందడుగు వేస్తుంది.. ఇందులో భాగంగా ఆరోగ్య శాఖ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది..
ఇక ప్రపంచాన్ని పీడిస్తున్న కరోనాను కూడా ఆరోగ్యశాఖలో చేర్చిన ఏపీ సీయం జగన్ ప్రజలకు మరింత మేలు చేకూర్చారని అంటున్నారు.. పేద, మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం పొందాక కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం వారికి ఎంతో అండగా నిలుస్తోందని పేర్కొంటూ ఆరోగ్య శ్రీ పేదల పాలిట పెద్ద దిక్కుగా మారి అసరాగా నిలించిందన్నారు.. ఇకపోతే గత పది నెలల్లో 134 కోట్ల వ్యయంతో 2.10 లక్షల మందికి ఆరోగ్య ఆసరా కింద డిశ్చార్జైన 48 గంటల్లోనే వారి ఖాతాల్లోకి రూ.5 వేలు అందేలా చేశారు వైఎస్ జగన్.. దీన్ని చూస్తే అర్ధం అవుతుంది వైఎస్ జగన్ గారి ముందు చూపునకు ఈ పధకం మచ్చుతునక’ అంటూ తన ట్విటర్ ఖాతాలో ప్రశంసలు గుప్పించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..
ఒకవైపు చేస్తున్న అభివృద్ధిని గమనించక ప్రతిపక్షాలు పోరు పెడుతున్నా, అధికార ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా వెనకడుగు వేయడం లేదు వైఎస్ జగన్.. అదీగాక బడ్జెట్ లోటు ఉన్నా ఏపీ ప్రజలకు అందవలసిన సంక్షేమ పధకాలను ఆపడం లేదు.. ఇలా ఏపీ అభివృద్ధికి కావలసిన ఎన్నో ప్రణాళికలు అమలు చేస్తున్నారు.. ఇదే కాకుండా బీసీల అభివృద్ధి కోసం కూడా కార్పోరేషన్ నియమించి వీటి ద్వారా బీసీలకు అన్ని రకాల ఆర్థిక సహాయాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్ ఎండీకి ఇవ్వనుంది.. ఇలా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వైఎస్ జగన్ చేస్తున్న కృషి చూసి ప్రతిపక్షం ఓర్వలేకపోతుందంటు తెలియచేశారు విజయసాయి రెడ్డి.