చిక్కుల్లో వైఎస్ జగన్.. తేడా వస్తే పరిస్దితి ఏంటి.. ??

 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితం తన తండ్రి ఉన్నప్పుడు ఒకలా.. ఆయన మరణాంతరం ఒక యుద్ధంలా సాగుతుందనడంలో సందేహం లేదు.. ఇక పూర్తిగా రాజకీయాల్లోకి దిగి సొంతగా పార్టీని స్దాపించిన సమయంలో ఎన్నో ఒడిదుడుకులు.. ఇవన్ని మనోధైర్యంతో ఎదుర్కొని సీయం అనే పీఠాన్ని చేపట్టిన తర్వాత అవాంతరాల ప్రవాహల్లో ఎదురీదుతూ తనపాలనను కొనసాగిస్తున్నాడు.. ఇకపోతే జగన్ గత ఏడాది మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాతి తొలి ఆరు నెలల కాలంలో ఆయన పాలనారధానికి అడ్డు లేకుండా పోయింది. ఈ దశలో ఏపీనీ అనుభవం లేని ఈయన ఏం పాలిస్తాడని అనుకున్న వారే నోరు మూసుకునేలా చేశారు..

సీయంగా వైఎస్ జగన్‌కు ఎదురులేదనుకుంటున్న సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదన తెరమీదికి వచ్చింది.. ఆనాటి నుంచే కొత్త కష్టాలు మొదలవగా ఆ నేపధ్యంలో ఆయన శాసన మండలి రద్దు దాకా వెళ్ళారు. ఇక ఇపుడు కోర్టులతోనూ ఢీ కొంటున్నారు. ఇలా ఓ వైపు రాజకీయంగా విపక్షాలను ఎదుర్కుంటునే మరో వైపు కరోనా లాంటి అంతర్జాతీయ సమస్య సుడిగుండలో అల్లాడుతున్నాడు.. ఈ వైరస్ ప్రభావం తగ్గినా ఏపీ ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పేసింది. నిజానికి ఏపీ తీవ్ర ఆర్ధిక సంక్షోభం మధ్యన చిక్కుకున్న త‌రువాత కరోనా వచ్చి ఇంకా తల్లకిందులు చేసిందట.. అయినా వైఎస్ జగన్ ఎక్కడా తగ్గ లేదు..

ఇదే సమయంలో తన మూడు రాజధానుల పంతం నెరవేర్చుకోవడానికి ఏకంగా సీనియర్ సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద ఆరోపణలు చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. అందుకే తేడా వస్తే వైఎస్ జగన్ పరిస్థితి ఏంటి చర్చ ఏపీలో మొదలైందట.. ఇక ఈ యువ సీయం అంటే ఇష్టపడే న్యాయవాదులు సైతం ఆయన ఎందుకిలా చేశారని చర్చించుకుంటున్నారట.. అదీగాక జగన్ పెద్ద చిక్కుల్లోనే పడుతున్నారా.. ఏదైనా తేడా జరిగితే పరిస్దితి ఏంటంటూ అనుమానాలూ ఆయన అభిమానులతో పాటు, పార్టీలో ఉన్న వారిలోనూ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయట. మరి ఆయన ఎందుకు ఇలా వేగం పెంచుతున్నారు అన్నది మాత్రం ఎవరికీ అర్ధం కావడం లేదట. ఇక చూడాలి మరి ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో..