YS Jagan: ఏపీలో ప్రస్తుతం కూటమి పార్టీలో అధికారంలో ఉన్నాయి. ఇలా ఎన్నికల సమయంలో పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పై పోటీకి దిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఎన్నికలలో కూటమి పార్టీ నేతలు అద్భుతమైన విజయంతో అధికారాన్ని అందుకున్నారు. ఇక 2019 ఎన్నికలలో 151 స్థానాలలో సింగిల్ గా పోటీ చేసి గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో మాత్రం కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యారు.
ప్రస్తుతం అధికారంలో కూటమి పార్టీలు ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేసే దిశగా ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీలను రాష్ట్రంలో బలపరుచుకోవడానికి ఇదే సరైన అంశం అని భావించి సరికొత్త ప్రణాళికలను రచిస్తున్నారు. ఇదే తరుణంలోనే జగన్ పార్టీని కూడా దెబ్బతీయాలని ప్రణాళికలను రచిస్తున్నారు.
ఈ ఎన్నికలలో కూటమి పార్టీలు గెలవడంతో జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉన్నటువంటి బాలినేని విజయసాయిరెడ్డి వంటి ఎంతోమంది కీలక నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇలా ఎంతోమంది కీలక నేతలు బయటకు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆవిర్భావ రోజులకు గుర్తుకు వస్తున్నాయి. ఆరోజు కాంగ్రెస్ ఎంపీగా తన పదవికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన జగన్ ఒంటరిగా పోరాటం చేశారు అయితే ఆ సమయంలో విజయసాయిరెడ్డి తన తల్లి విజయమ్మ షర్మిల వంటి వారు తన పక్కన నిలిచారు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీరందరికీ దూరమవుతూ ఒంటరి అయ్యారు. దీంతో బీజేపీ జగన్ మోహన్ రెడ్డి సమర్థతకు గట్టి పరీక్ష పెడుతుంది మరి ఈయన కూడా ఈ పరిస్థితులను తట్టుకొని తిరిగి అధికారం అందుకుంటారా లేకపోతే కూటమి పార్టీల ఒత్తిడికి మరింత నలిగిపోతారా అనేది కాలమే నిర్ణయిస్తుంది.
