Y.S Jagan: చంద్ర బాబు ప్రభుత్వం పై జగన్ ప్రశంశలు….మీ త్యాగానికి వెలకట్టలేం అంటూ!

Y.S.Jagan: వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కల్లితాండకు వెళ్లిన విషయం తెలిసిందే. వీర జవాన్ మురళి నాయక్ మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసం పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు వెళుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు మురళి నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు .

బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేరుగా రోడ్డు మార్గాన సత్యసాయి జిల్లాకు కల్లి తండాకు చేరుకున్నారు. ఇలా అక్కడికి వెళ్ళగానే మురళి నాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం మురళి నాయక్ తల్లిదండ్రులను ఓదారుస్తూ వారితో కాసేపు మాట్లాడి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈయన మీడియాతో మాట్లాడారు.

వయసులో చిన్నవాడైన మురళి నాయక్ దేశం కోసం ఎంతో పోరాటం చేస్తూ తన అక్క చెల్లెలు అన్నదమ్ములను రక్షించడం కోసం ఆయన ప్రాణాలు అర్పించారని ఈ త్యాగానికి మనం వెలకట్టలేమని తెలిపారు.పార్టీ తరపున 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దేశం కోసం పోరాడుతూ ప్రాణ త్యాగం చేసిన మురళి లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.

మురళి చేసిన త్యాగానికి దేశ ప్రజలంతా ఎప్పటికీ రుణపడి ఉంటారని జగన్ తెలిపారు. అయితే విధులు నిర్వహిస్తూ మరణించిన జవాన్లకు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇచ్చే విధానాన్ని తమ ప్రభుత్వం ప్రారంభించిందని అయితే ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇక మురళి కుటుంబానికి 50 లక్షల రూపాయల ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చినందుకు ఈయన కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా తన పార్టీ తరఫున 25 లక్షల ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 లక్షల ప్రకటించారు. వీటితోపాటు తన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం 5 ఎకరాల వ్యవసాయ పొలం 300 గజాల ఇంటి స్థలం కూడా ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.