Posani: అరెస్ట్ అయిన పోసాని కృష్ణమురళి…. రంగంలోకి దిగిన వైఎస్ జగన్?

Posani: ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఎంతోమంది వైకాపా నేతలను అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా గతంలో తమని టార్గెట్ చేసిన వారందరిపై కక్ష సాధింపు చర్యలలో భాగంగా కూటమి ప్రభుత్వం అరెస్టులు చేస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ వైసీపీ అధినేత, శ్రేణులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గత ప్రభుత్వ హయాంలో ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. అదే విధంగా చంద్రబాబు లోకేష్ పవన్ వ్యవహార శైలి గురించి ఈయన మీడియా సమావేశంలో మాట్లాడారు అయితే పవన్ చంద్రబాబు లోకేష్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను ఈయనపై పలుచోట్ల కేసులు నమోదు అయ్యాయి.

ఈ క్రమంలోనే శివరాత్రి పండుగను పురస్కరించుకొని రాత్రి పోలీసులు హైదరాబాద్లోని పోసాని ఇంటిలోకి వెళ్లి ఆయనను అరెస్టు చేశారు. తనకు ఆరోగ్యం బాలేదని తన భార్య చెబుతున్నప్పటికీ వినకుండా పోలీసులు తనని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇక నేడు ఆయనని వైద్య పరీక్షల అనంతరం ఏపీ తీసుకురాబోతున్నారు. ఇలా పోసాని అరెస్టు కావడంతో వైసీపీ సోషల్ మీడియా నుంచి చంద్రబాబు నాయుడు కూటమి పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు చేస్తూ ఉన్నారు.

చంద్రబాబు చేసే పనుల గురించి అవినీతి గురించి ప్రశ్నిస్తే ఇలా అరెస్టులు చేస్తారా అంటూ మండిపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని కేవలం రెడ్ బుక్ పాలన నడుస్తోంది అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక పోసాని అరెస్టు కావడంతో జగన్ స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు వైసీపీ శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడంతో ఈయన మూలాఖత్ లో భాగంగా జైలుకు వెళ్లి వారందరిని పరామర్శిస్తున్న సంగతి తెలిసిందే. మరీ పోసాని విషయంలో జగన్ నిర్ణయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది అయితే గత కొద్ది రోజుల క్రితమే పోసాని రాజకీయాలకు వైసిపి పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

పోసాని భార్యకు జగన్ ఫోన్ || YS Jagan Phone Call With Posani Murali Krishna Wife | Posani Arrest | TR