Posani: పోసాని అరెస్టుపై స్పందించిన జగన్…. రంగంలోకి దిగిన వైసీపీ లాయర్లు!

Posani: రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వైసిపి నేతలను అరెస్టు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే .అయితే తాజాగా వైసిపి నేత సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని కూడా పోలీసులు అరెస్టు చేశారు అయితే ఈయన గత కొద్ది రోజుల క్రితమే తాను వైసిపి పార్టీకి అలాగే రాజకీయాలకు కూడా దూరంగా ఉంటున్నానని రాజీనామాను ప్రకటించారు.

ఇలా రాజీనామా చేసిన అనంతరం కూడా ఈయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే వైసిపి హయామంలో ఈయన ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆ సమయంలో కూటమి నేతల గురించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అంటూ పోసానిపై పలుచోట్ల కేసు నమోదు కావడంతో పోలీసులు తనని అరెస్టు చేసే జైలుకు పంపించారు.

ఇక ఈయన గతంలో వైసిపి పార్టీ కోసం పనిచేశారు అయితే ప్రస్తుతం వైసీపీకి రాజీనామా చేసినప్పటికీ కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి పోసాని అరెస్టు గురించి స్పందించారని తెలుస్తోంది. పోసాని అరెస్టు అయిన అనంతరం ఈయన వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించడమే కాకుండా ధైర్యంగా ఉండాలి అంటూ భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరుగుతున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని, కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. పార్టీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని, ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని జగన్ తెలిపినట్టు సమాచారం. ఇక పోసాని అరెస్టు కావడంతో గతంలో ఈయన చంద్రబాబు లోకేష్ పవన్ గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను వైరల్ చేస్తున్నారు.