ఏపీ సీయం వైఎస్ జగన్ గత రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే.. అయితే వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన మామూలే అయినా తాజా రాజకీయ పరిణామాలతో అది మరింతగా ఆసక్తిని రేకెత్తించింది.. కాగా వైఎస్ జగన్ ఆ భేటీలో తాజా రాజకీయాలతో పాటు మూడు రాజధానులు, మండలి రద్దు, కోవిడ్ కట్టడి చర్యలను ప్రధానికి వివరించినట్లుగా తెలిసింది.. అంతే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాలనూ ప్రస్తావించారట..
కాగ దాదాపు 8 నెలల తర్వాత ప్రధాని మోడీతో, వైఎస్ జగన్ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే ఈ విషయాలు సుమారుగా అందరికి తెలిసినవే.. కానీ తెరవెనుక ఈ భేటిలో అసలు సంగతులు ఏమిటన్నది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఈ క్రమంలో వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం కేంద్ర మంత్రివర్గంలో చేరాలని నరేంద్ర మోడీ వైఎస్ జగన్‌కు ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే ఎన్‌డీఏ నుంచి శివసేన తప్పుకోగా, వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ బయటకు వచ్చింది. అందువల్ల ఎన్‌డీఏలో చేరమని మోడీ తాజా భేటిలో వైఎస్ జగన్ తో ప్రస్తావించారట..
ఈ దశలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి వైసీపీ ఆసక్తి కనబరచక పోతే కనీసం ఖాళీగా ఉన్న లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిని అయినా అంగీకరించాలని వైఎస్ జగన్ ను మోడీ కోరినట్టు సమాచారం. ఒక వేళ దీనికి అంగీకరిస్తే వైఎస్ జగన్ కు చాలా సన్నిహితుడైన వైసీపీ ఎంపీ, పి మిథున్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తామని మోడీ సూచించారట. అయితే మోడీ ప్రతిపాదనకు సీఎం వైఎస్ జగన్ తక్షణం స్పందించకుండా, పార్టీలో చర్చించిన తరువాత కాల్ చేస్తానని తెలిపారని సమాచారం.. ఇకపోతే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా 1999 లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కూడా ఈ విషయంలో చంద్రబాబు ఆలోచననే కాపీ కొట్టారా అని అనుకుంటున్నారట విషయం తెలిసిన నాయకులు.. ఏది ఏమైనా ఇప్పటి వరకు తనకంటు ఒక ఇమేజ్ ఏర్పరచుకున్న వైఎస్ జగన్ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ను అంగీకరిస్తారా లేదా అలాంటి పదవులకు దూరంగా ఉంటారా అనేది చూడాలి..