ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగులకు వైద్యం అందించేందుకు ఆస్పత్రుల పెంపు, కరోనా చికిత్సకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన కోసం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రానున్న ఆరునెలల్లో కోవిడ్ చికిత్సకోసం 1000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు సీయం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
ఇక ఇప్పటికే కరోనా పరిస్థితులకు తగ్గట్టు మరిన్ని మెరుగైన చర్యలను తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక్కో కరోనా రోగి కోస్ దాదాపు రూ 35 వేల వరకు ఖర్చు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే కోవిడ్ చికిత్స కోసం మరో వెయ్యి కోట్లు కేటాయించడం విశేషం.
ఏపీలో ప్రస్తుతం కరోనా కేసులు ప్రతిరోజు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 84 ఆస్పత్రులను కోవిడ్ బాధితుల కోసం ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. అయితే ఇప్పుడు అదనంగా మరో 54 ఆస్పత్రులను కోవిడ్ పేషెంట్ల కోసం ఏర్పాటు చేయనున్నారు. దీంతో కరోనా రోజుల కోసం ఏర్పాటు చేసిన ఆస్పత్రుల సంఖ్య 138కి చేరుతుంది. మరోవైపు కరోనా టెస్టులు, క్వారంటైన్ సదుపాయాల కోసం, ఏపీ ప్రభుత్వం రోజుకు సుమారు 6.5 కోట్లు చొప్పున ఖర్చు చేస్తుంది.