ఇప్పుడు మాట్లాడండి రా డిక్లరేషన్ గురించి … ! 

 

ఓరి నీ బండబడా అసలు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది. హిందు వ్యతిరేకిగా ముద్రవేయించుకున్న వైఎస్ జగన్ చేస్తున్నదేమిటి. నిన్నమొన్నటి వరకు హిందు ఆలయాల పై, దాడుల విషయం, తీవ్ర స్దాయిలో వెళ్లింది.. అంతే కాకుండా తిరుమల డిక్లరేషన్ వ్యవహారంపై, ఏపీలో రాజకీయంగా దుమారం రేగుతూనే ఉంది. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని చేసిన కొన్ని వ్యాఖ్యలు మాటల యుద్ధానికి దారి తీశాయి. ఇదే సమయంలో వైఎస్ జగన్ హిందువుల పక్షాన నిలవడం లేదనే అపవాదు వేయడం కూడా జరిగింది.. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న టైంలో జగన్ మూడు నామాలతో ప్రత్యక్షం అయ్యాడు.. అప్పటి వరకు నిప్పు కణికలా రగులుతున్న వివాదాన్ని తన పంచెకట్టుతో, మూడు నామాలతో, తిరుమలను దర్శించుకుని ఆర్పేశారు.. మనిషిలో కాస్తంత బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి ఉంటే తీవ్రంగా మారే సమస్యను సైతం సింఫుల్ గా తేల్చేయొచ్చు అని నిరూపించారు ఈ యంగ్ సీయం.. దీంతో అదే పనిగా ఇబ్బంది పెట్టే ప్రత్యర్థులకు మౌనంగా చెక్ పెట్టినట్టు అయ్యింది అనుకుంటున్నారట వైసీపీ నాయకులు.

ఇకపోతే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టువస్త్రాలు ఇచ్చే కార్యక్రమానికి సీఎం హోదాలో జగన్ హాజరు కావాల్సి ఉండటం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. స్వామి వారిని దర్శనం చేసుకునే సమయంలో అన్యమతస్తులు ఇచ్చే డిక్లరేషన్ మీద చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అవడమే కాదు.. చూస్తుండగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిపోయిందన్న విషయం తెలిసిందే.. ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుగా మీడియాతో పాటుగా, సోషల్ మీడియాలో ఈ అంశంపై సాగిన రచ్చ అంతా ఇంత కాదు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటుగా, బీజేపీ నేతలు కూడా కస్సుమనటం.. దానికి అధికారపక్షం కౌంటర్లు ఇవ్వటంతో.. వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఎలా సాగుతుందన్నది ప్రశ్నగా మారడమే కాదూ, ఈ ఇష్యూను జగన్ ఎలా డీల్ చేస్తారా? అన్న ఉత్కంఠ చాలామందిలో కనిపించింది.

 

కానీ అందరి అంచనాలకు భిన్నంగా తన మీద అప్పటివరకు వినిపిస్తున్న విమర్శలకు చెక్ చెబుతూ.. తనదైన శైలిలో రియాక్టు అయ్యారు సీయం జగన్. తిరుమలకు చేరుకున్న ఆయన స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించటానికి ముందు.. పంచె కట్టుకొని.. నుదుటిన నామాలు పెట్టించుకుని పూర్తి సంప్రదాయబద్ధంగా మారి.. పట్టువస్త్రాల్ని స్వామికి అందజేశారు. దీన్ని బట్టి అర్ధం అయింది ఏంటంటే అన్యమతస్తులకు డికర్లేషన్ నింపాలన్న వాదనకు పూర్తిస్థాయిలో చెక్ చెప్పటమే కాదు.. తాను పెట్టుకున్న నామాలతో డిక్లరేషన్ మాట అవసరం రానట్లుగా ఇష్యూను జగన్ తేల్చేశారు.. మరి ఈ విషయంలో ఇప్పటి వరకు లేచిన నోర్లు ప్రస్తుతం ఏమంటాయో అని అనుకుంటున్నారట వైఎస్ జగన్ అభిమానులు..