7 Arts Sarayu: వెనక్కి తగ్గిన సరయు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

7 Arts Sarayu: సెవెన్ ఆర్ట్స్, బిగ్ బాస్ కంటెస్టెంట్ సరయు ఫై తాజాగా హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన సంగతి మనందరికీ తెలిసిందే. సరయు నటించిన ఒక షార్ట్ ఫిలిం హిందూ సమాజాన్ని అదేవిధంగా మహిళలను కించపరిచే విధంగా ఉంది అంటూ సిరిసిల్ల జిల్లా విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చేపూరి అశోక్ ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సరయు ని అదేవిధంగా ఆ షార్ట్ ఫిలిం బృందాన్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే సరయు తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు వివరణ ఇచ్చింది.

తన వీడియోలో ఉన్న కంటెంట్ పై అభ్యంతరాలు ఉంటే, సదరు వ్యక్తులకు క్షమాపణలు చెప్పడానికి ఆమె సిద్ధం అని తెలిపింది. అంతేకాకుండా పిటిషనర్ డిమాండ్ మేరకు ఆ కంటెంట్ ను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే ఆ వీడియోలో అభ్యంతరకర సన్నివేశాలను ఎడిట్ చేశామని సరయు పోలీసులకు తెలిపింది. అయినప్పటికీ అభ్యంతరము అనుకుంటే ఆ వీడియో ని పూర్తిగా డిలీట్ చేస్తాము అంటూ సరయు తో పాటు ఆమె టీం కూడా వెనక్కి తగ్గింది. అయితే పిటిషనర్ చేపూరి అశోక్ సిరిసిల్ల బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు.

పిటిషనర్ వచ్చిన తర్వాత ఇరువర్గాలను కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేపట్టనున్నారు అని తెలుస్తోంది.7ఆర్ట్స్‌ ఫ్యామిలీ రెస్టారెంట్‌ కోసం గతేడాది సరయు తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వీడియో రిలీజ్‌ చేసింది. అయితే ఇందులో సరయు సహా ఆమె టీం తలకు గణపతి బొప్పా మోరియా అని రాసి ఉన్న రిబ్బన్లు ధరించి మధ్యం సేవించినట్లు వీడియో రూపొందించారు. అయితే గణపతి బప్పా మోరియా అనే బ్యాండ్ ను తలకు ధరించి మద్యం సేవించారని, దేవుడి బొమ్మలు ధరించి మద్యం సేవించి హోటల్స్ దర్శిస్తారనే సంకేతాన్ని పంపుతున్నారని విహెచ్ పి నేత ఆపేక్షించారు.