యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లో ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయో అదే స్థాయిలో డిజాస్టర్లు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలను ఎన్టీఆర్ చేసి ఉంటే మాత్రం తారక్ కెరీర్ మరో లెవెల్ లో ఉండేదని ఫ్యాన్స్ లో చాలామంది భావిస్తారు. అయితే ఎన్టీఆర్ నో చెప్పిన సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.
కథ నచ్చక జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయగా కథ నచ్చినా తనకు సూట్ కావని తారక్ మరికొన్ని సినిమాలను రిజెక్ట్ చేశారని బోగట్టా. తారక్ రిజెక్ట్ చేసిన సినిమాలలో బ్రహ్మోత్సవం సినిమా ఒకటి. శ్రీకాంత్ అడ్డాల ఈ కథను ఎన్టీఆర్ కు చెప్పగా తన ఇమేజ్ కు సూట్ అయ్యే కథ కాదని ఎన్టీఆర్ సున్నితంగా నో చెప్పారు. అనిల్ రావిపూడి రాజా ది గ్రేట్ కథను మొదట తారక్ కు వినిపించారు.
కథ నచ్చినా అంధుడి రోల్ రిస్కీ రోల్ కావడంతో పాటు అనిల్ రావిపూడి అప్పటివరకు స్టార్ హీరోలతో పని చేయకపోవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు నో చెప్పారు. ఊపిరి సినిమాలో ఎన్టీఆర్ హీరోగా ఫైనల్ అయ్యారని వార్తలు వచ్చాయి. అయితే ఫ్యాన్స్ వద్దని సూచించడంతో ఆ సినిమా నుంచి తారక్ తప్పుకున్నారు. భద్ర సినిమా కథను బోయపాటి శ్రీను ఎన్టీఆర్ కు చెప్పగా అప్పటికే ఆ తరహా సినిమాలు వచ్చి ఉండటంతో ఎన్టీఆర్ ఆ సినిమాకు నో చెప్పారు.
శ్రీమంతుడు కథను కొరటాల శివ మొదట ఎన్టీఆర్ కు వినిపించారని బోగట్టా. కానీ రిస్కీ సబ్జెక్ట్ కావడంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు నో చెప్పారు. కిక్, కృష్ణ, ఆర్య, దిల్, అతనొక్కడే సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినా ఆ ఆఫర్లకు ఎన్టీఆర్ నో చెప్పారు. ఎన్టీఆర్ నో చెప్పిన కథలతో రవితేజ ఎక్కువగా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు.