మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత శిద్ధా రాఘవరావు ఇటీవల వైకాపా కండుపా కప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ లో ఉన్నంత కాలం టెన్షన్ పడిన శిద్దా ఇప్పుడు గుండెలు మీద చేయి వేసుకుని ధైర్యంగా ఉన్నారు. అధికార పక్షం వైపు వాలిపోతే ఐదేళ్ల పాటు ఎలాంటి ఢోకా ఉండదు. పార్టీ అన్నిరకాలుగా ఆదుకుంటుంది కాబట్టి ధీమాగా ఉండొచ్చు. ప్రస్తుతం శిద్ధా అదే ఆనందంతో ఉన్నారు. శిద్ధా వైకాపాలోకి జంప్ అవ్వగానే ప్రభుత్వం రక్షణ కోసం వ్యక్తిగత గన్ మెన్ లను కేటాయించింది. ఏస్పీ ఆదేశాల మేరకు ఆగమేఘాల మీద శిద్దాకు రక్షణ దళం ఏర్పాటైంది. ఇన్నాళ్లు గన్ మెన్ లేక భయపడ్డ శిద్దా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు.
వైకాపాలో చేరితో ఎలాంటి రక్షణ దొరుకుతుందో టీడీపీ సీనియర్స్ కి ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు ప్యాన్ గాలి వీచేందుకు రెడీగా ఉన్నారని ప్రచారం సాగింది. ఆ విషయం పక్కనబెడితే మాజీ యువ మత్రి కిడారి శ్రావణ్ కుమార్ వైకాపా లో చేరడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. వైకాపా అధికారంలోకి రావడంతో శ్రావణ్ కి ప్రొటక్షన్ తగ్గింది. ప్రస్తుతం ఎలాంటి గన్ మెన్ లు లేకుండానే బయట తిరుగుతున్నారు. అదీ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ఏరియా ఆయనది. శ్రావణ్ కుమార్ తండ్రి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు(అరకు నియోజకవర్గం) ని మావోయిస్టులు హతమార్చిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత చంద్రబాబు శ్రావణ్ కుమార్ ని తన కేబినేట్ లో మంత్రి ని చేసారు. ఇప్పుడెలాగు టీడీపీ అధికారం కోల్పోయింది కాబట్టి ఆ పార్టీలో ఉండి కూడా ఉపయోగం లేదని భావిస్తోన్న యువ నేత వైకాపా కండువా కప్పుకోవాలని చూస్తున్నారుట. ఇటీవల శిద్ధా వైకాపాలో చేరడం..వైకాపా ఆయనకు భద్రత కల్పించడం చూసి శ్రావణ్ కుమార్ ప్యాన్ కిందకు రావడానికి మరింత ఉత్సాహం చూపిస్తున్నారు అన్న టాక్ విశాఖ రాజకీయ వర్గాల్లో చర్చకొచ్చింది.