వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో బంద్ అనే మాట ఇప్పటివరకు వినిపించింది లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడూ బంద్ మాటలేదు. ప్రతిపక్షాలు, ఇతర సంఘాలు దీక్షలు, నిరసనలు చేసినా ఏనాడూ బంద్ చేయాలని ఎవరూ పిలుపునివ్వలేదు. ఈమధ్య కాలంలో కొన్ని ఉద్రిక్త సంఘటనలు, అరెస్టులు జరిగినా లాక్ డౌన్ మూలంగా విపక్షాలు ఏమీ చేయలేకపోయాయి. అది జగన్ ప్రభుత్వానికి బాగా కలిసొచ్చింది. ఏడాది నుండి అమరావతి రైతుల ఉద్యమం నడుస్తున్నా ఏనాడూ రాష్ట్ర బంద్ చర్చ రాలేదు.
అలాంటిదిప్పుడు మొదటిసారిగా రేపువా తేదీన రాష్ట్ర బంద్ తలపెట్టనున్నారు. రాష్ట్రంలో దళితులు, మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ఈ బంద్ జరిపానున్నట్లు న్యాయవాది, జై భీమ్ జస్టిస్ ఆక్సిస్ వ్యవస్థాపకులు శ్రావణ్ కుమార్ తెలిపారు. జగన్ అధికారంలోకి దళితులు, మైనారిటీలు, బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కొద్దిరోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరంలో 16 ఏళ్ల ఎస్సీ మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన, బాలిక తల్లి తన కుమార్తె కనిపించడంలేదని పోలీస్ స్టేషన్లో పిర్యాధు చేసినా వెంటనే స్పందన రాలేదనే ఆరోపణలను ఈ సంబధర్బంగా ప్రస్తావించారు ఆయన.
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిని ఇసుక అక్రమ రవాణా వాహనాలకు అడ్డుతగిలాడనే కారణంగా పోలీసులే స్టేషన్లో పెట్టి చితగ్గొట్టి శిరోముండనం, ప్రకాశం జిల్లాలో ముఖానికి మాస్క్ కట్టుకోలేదనే కారణంతో కిరణ్ కుమార్ అనే దళిత యువకుడిని చీరాల ఎస్సై చితకబాదాడు. దీంతో కిరణ్ కుమార్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత కన్నుమూశాడు. అలాగే నూతన నాయుడు వ్యవహారం కూడ సంచలనం రేపింది. ఈ ఘటనల్లో పెట్టిన కేసుల స్థితిగతులు ఏంటో జనాలకు తెలీదు.
వీటన్నింటినీ ఉటంకించిన శ్రావణ్ కుమార్ రాష్ట్రంలోని దళితులంతా తనకు లొంగి ఉండాలనే జగన్ అహంకార ధోరణికి దళితులు ఎవ్వరు కట్టుబడరని అంటూ బంద్ కు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మొదటిసారి జరుగుతున్న ఈ బంద్ కు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు మద్దతిచ్చి బంద్ ను విజయవంతం చేస్తే మటుకు జగన్ సర్కార్ మీద నెగెటివిటీ ఏర్పడే ప్రమాదముంది. మరి దీన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.