అరకు ఎమ్మెల్యే కిడారి సోమేశ్వర రావు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య కేసులో నలుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఈ కేసును డీల్ చేసిన డిసిపి పకీరప్ప తెలిపారు. సుబ్బారావు, శోభన్ ,ఈశ్వరి ,కోమల ను ఆదివారం సాయంత్రం ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నలుగురిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.
నిందితుల వద్ద నుంచి కరపత్రాలు బ్యానర్లు 10 కిలోల మందుపాతరలు 20 మీటర్ల విద్యుత్ వైరు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ కేసును విశాఖ నగర డీసీపీ పకీరప్ప దర్యాప్తు చేశారు. మావోయిస్టులకు ఆశ్రమ భోజన సదుపాయాలు కల్పించినట్లు ఈ నలుగురు అంగీకరించారని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.
కిడారి సర్వేశ్వరరావు సోముల హత్యలకు నలుగురు కారణమని నిర్ధారణ కు వచ్చిన తర్వాత వీరిని అరెస్టు చేశామని చెప్పారు. మావోయిస్టుల సిద్ధాంతాలకు ఆకర్షితులై సానుభూతిపరులుగా మారినట్లు గుర్తించామని తెలిపారు. భోజన సదుపాయం కూడా వీరు కల్పించినట్లు పోలీసులు తెలిపారు.