కిడారి శ్రావ‌ణ్ కుమార్ పై వైకాపా స్కెచ్ ఇదా?

సైకిల్ దిగి ప్యాన్ కింద‌కు రావ‌డానికి చాలా మంది తేదాపా నేత‌లు సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా స్థానిక ఎన్నిక‌ల‌కంటే ముందేగా జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడికి షాక్ ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్లు ఇప్ప‌టికే హెరెత్తిపోతుంది. ఏడాది కాలంగా జ‌గ‌న్ స‌ర్కార్ ని ఇర‌కాటంలో పెట్టి ఆడుకుంటోన్న చంద్ర‌బాబుకి అసెంబ్లీ లో ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేసేదీశ‌గా ఆ పార్టీ పావులు క‌దుపుతున్న‌ట్లు క‌థ‌నాలు వేడెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తెదాపాతో విసుగు పుట్టిన నాయ‌కులంద‌రినీ వైకాపా గూటికి చేర్చే కార్య‌క్ర‌మం చురుకుగా సాగుతోంది. ఈ నేప‌థ్యంలో యువ నాయ‌కుడు, మాజీ మంత్రి కిడారి శ్రావ‌ణ్ కుమార్ ని వైసీపీ ట్రాక్ లోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

శ్రావ‌ణ్ కుమార్ కూడా విశాఖ‌ని ప‌రిపాల‌నా రాజ‌ధానిగా ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి వైకాపా పై సానుకూలంగా ఉన్న‌ట్లు ఆయ‌న స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది. ఇదే అదునుగా భావించిన‌ వైకాపా ఎలాగైనా ఆ యువ నాయ‌కుడిని లాగేయాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తోందిట‌. శ్రావ‌ణ్ బ్యాంక్ గ్రౌండ్ విష‌యానికి వ‌స్తే కిడారి శ్రావ‌ణ్‌ తండ్రి దివంగ‌త స‌ర్వేశ్వ‌ర‌రావు 2014లో వైసీపీలోనే ఉన్నారు. ఆ ఏడాది ఎన్నిక‌ల్లో లో వైసీపీ త‌రుపున గెలిచారు. అప్పుడు వైకాపా అధికారంలో లేక‌పోడంతో టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆ త‌ర్వాత మావోయిస్టుల దాడి చేసి స‌ర్వేశ్వ‌ర‌రావుని చంపేసారు. దీంతో టీడీపీ స‌ర్వ‌శ్వ‌రావు కుమారుడైన శ్రావ‌ణ్ కుమార్ కి మంత్రి వ‌ర్గంలోకి చోటు క‌ల్పించారు. తండ్రిపై ఉన్న సానుభూతి, స్థానికంగా అత‌నికున్న బ‌లం గుర్తించి చంద్ర‌బాబు సీనియ‌ర్ల‌ను సైతం కాద‌ని శ్రావ‌ణ్ ని మంత్రిని చేసారు.

అయితే త‌ర్వాత ఆరు నెల‌ల వ్య‌వ‌ధిలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నిక కాలేక మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసారు. 2019లో టీడీపీ త‌రుపున పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. తండ్రిని చంపేసారు కాబ‌ట్టి శ్రావ‌ణ్ కూడా మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్న‌ట్లే . ఈ నేప‌థ్యంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో శ్రావణ్ కుమార్ కు ఏకంగా 16 మంది బ్లాక్ క్యాట్ కమాండోలతో భద్రత కల్పించారు. అయితే 2019 ఎన్నిక‌ల అనంత‌రం వైకాపా ప్ర‌భుత్వం ఆ భ‌ద్ర‌త‌ని 8కి కుదించింది. త‌ర్వాత కొన్ని నెల‌ల‌కు ఆ ఎనిమిది మంది న‌లుగురు అయ్యారు.

ప్ర‌స్తుతం పూర్తిగా భ‌ద్ర‌త ఎత్తేసారు. అయితే ఈప‌రిస్థితిని టీడీపీ ప‌ట్టించుకోలేదు. క‌నీసం ప్ర‌భుత్వాన్ని అడిగే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేదు. దీంతో శ్రావ‌ణ్ ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగింది. పార్టీకి దూరంగా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. తాజా ప‌రిస్థితుల్లో శ్రావ‌ణ్ కుమార్ కు వైకాపా దారి త‌ప్ప మ‌రో మార్గం లేని నేప‌థ్యంలో ఈ పార్టీ గూటికే చేరే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే శ్రావ‌ణ్ కుమార్ కి భ‌ద్ర‌త త‌గ్గిస్తే త‌మ‌వైపుకే వ‌స్తాడ‌ని వైకాపా వేసిన ఓ స్కెచ్ లాగా దీన్ని కొంద‌రు చెబుతుంటారు.