లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న దుర్గారావు ఏం చదువుకున్నారు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు.ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా విపరీతమైన అభిమానులను సంపాదించుకున్న ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న వారిలో టిక్ టాక్ దుర్గారావు ఒకరు. ఈయన డబ్ స్మాష్ వీడియోలు, టిక్ టాక్ వీడియోలు ద్వారా ఎంతో ఫేమస్ అయ్యారు. ఇలా టిక్ టాక్ బ్యాన్ చేయడానికి ముందు ఈయన టిక్ టాక్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ఇలా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే ఏకంగా 25 లక్షల మంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు.

హైదరాబాద్ లో తన మేనల్లుడు నివస్తున్నాడని తన మేనల్లుడు సహాయంతో తనకు టిక్ టాక్ వీడియోలు ఎలా చేయాలి ఎలా పోస్ట్ చేయాలి అనే విషయాలను నేర్చుకుని టిక్ టాక్ చేసే వాడినని ఆయన చెప్పుకొచ్చారు. ఇకపోతే ఇంతగా టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయినటువంటి ఈయన ఎంతవరకు చదువుకున్నారనే విషయం గురించి ప్రశ్నించగా తాను కేవలం రెండవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నానని ఈ సందర్భంగా దుర్గారావు తెలిపారు.

కేవలం రెండవ తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈయన తన మేనల్లుడు సహాయంతో సోషల్ మీడియా లోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియా వేదికగా ఇలాంటి క్రేజ్ ఏర్పరచుకొని ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ దంపతులువీరి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఎంతో పేదరికంలో జన్మించిన దుర్గారావు కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేస్తూ ఉండేవాడిని. భగవంతుడి దయవల్ల ప్రస్తుతం తన పరిస్థితి బాగుందని ఆయన తెలిపారు.