అలాంటి కండిషన్ తో బిగ్ బాస్ కార్యక్రమ నిర్వహకులకు షాక్ ఇచ్చిన దుర్గారావు?

బుల్లితెర పై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ లో ఎంపిక ప్రక్రియ కూడా పూర్తయిందనే సమాచారం వినపడుతుంది.అయితే ఈ కార్యక్రమానికి టిక్ టాక్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దుర్గారావు వస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి..

ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ ల జాబితాలో ఒకరైనటువంటి దుర్గారావు ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులకు చిన్న షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దుర్గారావు ఎక్కడికి వెళ్లిన ఒంటరి కాకుండా తన భార్యతో కలిసి వెళ్తారు. చిన్న ఇంటర్వ్యూ అయిన లేదా ఏదైనా కార్యక్రమం అయిన లేకపోతే ఏదైనా వీడియో చేసిన తప్పకుండా తన భార్య పక్కన ఉండాల్సిందే. ఇలా తన భార్య తనకు అదృష్టమే కాకుండా ఎంతో ధైర్యం అని దుర్గారావు ఎన్నోసార్లు వెల్లడించారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమంలోకి దుర్గారావుకి ఆహ్వానం రావడంతో ఈయన తనతో పాటు తన భార్యను కూడా పంపించాలని నిర్వాహకులను వేడుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి తన భార్య వచ్చినందుకు తనకు అదనపు పారితోషకం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తను తన వెంటే ఉంటే ఎంతో ధైర్యంగా ఉంటుందని అందుకే తనని బిగ్ బాస్ కార్యక్రమంలోకి పంపించాలని దుర్గారావు వేడుకున్నట్లు తెలుస్తోంది. మరి దుర్గారావు గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.