Health Tips: చియా విత్తనాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

Health Tips:ప్రకృతి మనకు అందించిన అతికొద్ది పౌష్టిక ఆహారాలలో చియ విత్తనాలు ప్రథమ స్థానంలో ఉంటాయని చెప్పవచ్చు. చియా విత్తనాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు , ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు మరియు కాల్షియం వంటి పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇటీవలి కాలంలో జరిపిన పరిశోధనలలో చియా విత్తనాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మనుషులతో పాటు జంతువులకు కూడా మంచివని నిపుణులు వెల్లడించారు. వీటిని చాలా సులభం గా నిల్వ చేయవచ్చు.

చియా విత్తనాల లో ప్రోటీనులు అధికంగా వీటిని తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గించి శరీర బరువు తగ్గించుకోవటానికి ఉపయోగపడతాయి. ఒక గ్లాసు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలను బాగా కలుపి కొద్ది సమయం తర్వాత ఆ నీటిని తాగాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల చియా విత్తనాలలో ఉండే ఫైబర్ మీ ఆకలిని నియంత్రించి బరువు తగ్గడం సులువవుతుంది. విత్తనాలను ప్రతిరోజు కోడిగుడ్ల కు ప్రత్యామ్నాయంగా కూడా తీసుకోవచ్చు.చియా విత్తనాల లో అధిక మొత్తంలో భాస్కరమ్ , క్యాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలను కాపాడుతుంది.

చియా విత్తనాలలో లైసిన్, ల్యూసిన్, ఐసోలూసిన్, మెథియోనిన్, థ్రెయోనిన్, ట్రిప్టోఫాన్, ఫెనిలాలనైన్, వాలైన్, హిస్టాడిన్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్యలు నియంత్రించటానికి ఉపయోగపడతాయి. ప్రతి రోజు చియా విత్తనాలను తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుతాయి.చియా విత్తనాలు గుండె సంబంధిత వ్యాధులు అరికట్టి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలలో విటమిన్ బి, జింక్, ఐరన్ మరియు మెగ్నీషియంతో ఉండటం వల్ల శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి.