టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసుకున్న కవచాల్లో ఆయన అనుకూల మీడియా ఒకటి. దాన్నే అందరూ ఎల్లో మీడియా అని కూడ అంటుంటారు. ఈ మీడియా వర్గం చంద్రబాబు నాయుడును మచ్చలేని చంద్రుడిలా చూపడానికి ప్రయత్నం చేస్తుంటుంది. బాబుగారు ఏం మాట్లాడినా కరెక్టే అంటుంది. ఆయన పాలనలో రాష్ట్రం సుఖపడిపోయినట్టు ప్రొజెక్ట్ చేస్తుంటుంది. ఇక బాబుగారి రాజకీయ ప్రత్యర్థులను అయితే వేరే లెవల్లో ఆడుకుంటుంది. ప్రధానంగా వైసీపీ, జగన్ ను బూచిలా ప్రజెంట్ చేస్తుంది. బాబుగారు అధికారంలో ఉన్నప్పుడు ఎల్లో మీడియా టాస్క్ ప్రత్యర్థుల్ని అణగదొక్కడం, అధికారంలో లేనప్పుడు ఆయన్ను పైకి లేపడం. గత ఏడాదిన్నరగా ఆ పైకెత్తే కార్యక్రమమే చేస్తోంది.
సుధీర్ఘ కాలం ఆ పని చేసి చేసి అలసిపోయినట్టుగా ఉంది ఎల్లో మీడియా. అందుకు తాజాగా ఏపీలో పేరుకున్న నిరక్షరాస్యత అంశమే సాక్ష్యం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి ర్యాక్ సాధించేసరికి అది సీబీఎన్ ఘనతేనని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. లెక్కలు తీసే కాల పరిమితికి చంద్రబాబే సీఎం కాబట్టి, అంతకు ముందు వరుసగా రెండుసార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మొదటి స్థానంలో నిలబడింది కాబట్టి క్రెడిట్ పూర్తిగా బాబుదేనని, జగన్ చేసింది ఏమీ లేదని రెండు రోజుల పాటు కథనాలు వాయించేసింది. కానీ అక్ష్యరాస్యతలో ఏపీ అట్టడుగున ఉండటానికి బాబుగారి పాలన కూడ ఇక కారణమేననే నిజాన్ని తొక్కిపెట్టడానికి ఎల్లో మీడియా చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు.
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని 9 ఏళ్లు పాలించిన బాబు నవ్యాంధ్రకు కూడ 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే 14 సంవత్సరాలు బాబుగారి పాలనలో రాష్ట్రం నడిచింది. 14 సంవత్సరాలంటే మాటలు కాదు. ప్రజెంట్ రాష్ట్రం ఉన్న పరిస్థితికి ఆ 14 ఇయర్స్ ఎంతగానో కారణమై ఉంటాయి. అంటే అక్షరాస్యత అంత తక్కువగా ఉండటానికి కూడ బాబుగారు ఒక ప్రధాన కారణమనేది ముమ్మాటికీ నిజం. చివరి ఐదేళ్ళ పాలనలో టీడీపీ సర్కార్ ప్రభుత్వ స్కూళ్ళను ఎంతలా నిర్లక్ష్యం చేసిందో అందరికీ ఎరుకే. అందుకే జనం బాబు మీద మండిపడ్డారు. దీంతో ఎల్లో మీడియా బాబును కవర్ చేయడానికి ఏవేవో లెక్కలు చూపిస్తూ ప్రయత్నాలు చేసింది. అయినా జనం నమ్మలేదు. ఎందుకయ్యా ఈ కవరింగ్స్ అంటూ మండిపడుతున్నారు. దీంతో ఎల్లో మీడియా ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక చేసేది లేక ఎల్లో మీడియా ఈ విషయంలో మిమ్మల్ని కవర్ చేయడం మావల్ల కాదు సార్ అన్న తరహాలో చేతులెత్తేసి వేరే టాపిక్స్ వెతుక్కుంటోంది.