కేంద్రంలోని రాజకీయాలు ఏపీ రాజకీయాలను శాసిస్తున్నాయా అంటే అవును, కాదనే సమాధానాలు వస్తాయి.. రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తున్న వారు అవునంటే, మరి కొందరు అదెలా సాధ్యం అవుతుందంటారు.. కానీ ఒక బలమైన నాయకునితో, మరో బలమైన నాయకుడు జతకడితే ఆ బలం రెండింతలు అవుతుందనేది అందరికి తెలిసిందే.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదే జరుగుతుందట.. ఆ విషయం ఏంటో చూస్తే.. ఈ మధ్యకాలంలో వైఎస్ జగన్ ఢిల్లీ టూర్‌లో అమిత్ షా ను రెండు సార్లు కలవడం చర్చాంశనీయంగా మారింది.. అయితే ఢిల్లీ నుండి ఏపీకీ వైఎస్ జగన్ వచ్చాక ఢిల్లీ టూర్ వెనక కారణం వైసీపీని, ఎన్‌డీఏలో కలవడానికే అమిత్ షా పిలిపించారు అనే వాస్తవం బయటకు రావడం జరిగింది.
ఇక అమిత్‌షా తో మాటమంతి అయ్యింది కదా ఇప్పుడు పెద్ద బాస్ అయిన మోదీ గారితో మీటింగ్ ఉంది.. ఇంకా తేదీ, ముహూర్తం ఫిక్స్ అవ్వలేదు కానీ ఢిల్లీ నుండి కబురు వచ్చింది, వచ్చే వారంలో ఎప్పుడైనా వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి మోడీని కలిసి రానున్నారని ప్రచారం జరుగుతుంది.. ఇకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా ఈ మధ్యకాలంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కూటమిగా ఉన్న ఎన్‌డీఏ నుండి ఒక్కో పార్టీ జారుకోవడం, గత ఏడాది ఎన్నికలకు ముందు టీడీపీ, ఆ తరువాత శివసేన, తాజాగా అకాళీదళ్ ఇలా ప్రాంతీయ పార్టీలు ఎన్‌డీఏ నుండి జారుకోవడం, ఎన్‌డీఏకి రాజ్యసభలో అవసరాలు పెరగడం, ఇవన్నీ చూస్తుంటే బీజెపికి దక్షిణాదిలో బలమైన మిత్ర పక్షం కావాలి.
ఈ నేపధ్యంలో తమిళనాడులో అన్నా డీఎంకేని నమ్ముకుని ఉండలేరు. తెలంగాణలో కెసిఆర్ ను అసలే నమ్మరు. ఇక ఏపిలో చంద్రబాబు ఎప్పుడు ఏం మాట్లాడతారో, తన రాజకీయ తంత్రాలతో ఏ చీకటి బాగోతాలు చేస్తారో తెలియదు. కాబట్టి వీరెవరిని నమ్మే స్దితిలో లేని బీజేపీ సీయం వైఎస్ జగన్ వైపు దృష్టి సారించి లాగే ప్రయత్నం చేస్తుందట.. ఎందుకంటే వైఎస్ జగన్ ఎలాగూ మన చేతిలోనే ఉంటాడు, కాదంటే ఆయన మీద ఉన్న కేసులను వాడుకోవచ్చని అనుకుని వైసీపీని ఎన్‌డీఏలో ఆహ్వానిస్తున్నారట ఈ పెద్దలు.. మరి వచ్చే వారం ఏం జరుగుతుందో చూద్దాం..