డిసెంబర్ 1 న జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేయడానికి ప్రధాన పార్టీలన్నీ సిద్ధం అవుతున్నాయి, నామినేషన్స్ పక్రియ చివరి దశకు చేరుకుంది. తెరాస, బీజేపీ, కాంగ్రెస్,టీడీపీ, జనసేన, వామపక్షాలు పోటీచేయడానికి తమ తమ అభ్యర్థులను నిలబెడుతుంది. ఇలాంటి సమయంలో ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీనుండి ఒక ప్రకటన వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అధకారికంగా ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా పార్టీని భవిష్యత్తులో బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు గట్టు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
జగన్ పాలన మీద నమ్మకం లేదా..?
వైసీపీ నుండి ఇలాంటి ప్రకటన రావటం ఒక రకమైన అయోమయానికి గురిచేస్తుంది. ప్రస్తుతం పక్క రాష్ట్రము ఆంధ్రాలో 151 అసెంబ్లీ స్థానాలు సాధించి అధికార పగ్గాలు అందుకొని పరిపాలన చేస్తుంది. వైసీపీ సర్కార్ అంటేనే ప్రజాపాలన అని, తమ పాలనలో రాష్ట్రము అద్భుతంగా ముందుకు వెళ్తుందని వైసీపీ నేతలు చెపుతున్నారు, గ్రేటర్ పరిధిలో ఎక్కువగా ఆంధ్ర వాళ్లే ఉంటున్న విషయం తెలిసిందే, అలాంటప్పుడు ఆంధ్రాలో అద్భుతమైన పాలన సాగిస్తున్న వైసీపీ పార్టీ గ్రేటర్ పోటీచేస్తే ఆంధ్ర ఓట్లు ఇక్కడ వైసీపీ పార్టీకి పడే అవకాశం ఉంది కదా..? అలాంటి అవకాశం ఉన్నకాని ఎందుకు పోటీచేయటం లేదు..? ఆంధ్రాలో వైసీపీ పాలనపై ఆ పార్టీ నేతలకే నమ్మకం లేదా..? లేక గ్రేటర్ లో పోటీచేసి ఓడిపోతే దాని ప్రభావం ఆంధ్రాలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద పడుతుందేమో అనే భయమా..?
పార్టీ బలోపేతం: నమ్మేదెలా
వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ వ్యాప్తంగా పార్టీని భవిష్యత్తులో బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే అయన మాటలకూ ప్రస్తుతం జరుగుతున్నా విషయాలకు అసలు పొంతన లేదు. ఆంధ్ర జనాలు ఎక్కువగా ఉండే గ్రేటర్ పరిధిలోనే పోటీచేయడానికి భయపడిన వైసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తుంది. అయినా పార్టీ బలపడాలంటే గెలుపోటములతో సంబంధం లేకుండా జరుగుతున్నా ప్రతి ఎన్నికల్లో పోటీచేసి క్రమక్రమంగా తమ బలం పెంచుకుంటూ, కార్యకర్తలకు భరోసా కలిపిస్తూ, ఓటు బ్యాంకును సిద్ధం చేసుకోవాలి కానీ, పార్టీని బలోపేతం చేయటం కోసం చూస్తున్నాం, కానీ ఎన్నికల్లో చేయమంటూ ప్రకటించటం ఏమిటో, దాని వెనకున్న వ్యూహాలు ఏమిటో వైసీపీ నాయకత్వానికే తెలియాలి.
తెలంగాణలో జెండా పీకేయటమే తరువాయి
నిజానికి తెలంగాణలో అసలు వైసీపీ పార్టీ ఉందా..? అనే విషయం ఆ పార్టీ నేతలే మర్చిపోయారంటే అర్ధం చేసుకోవచ్చు, వైసీపీ తెలంగాణలో ఏ మాత్రం యాక్టీవ్ గా ఉందో, కొద్దోగొప్పో టీడీపీ నయం, అప్పుడప్పుడు తెలంగాణ సమావేశాలు నిర్వహిస్తుంటారు, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు మీడియా ముందుకు వచ్చి కనీసం తన ఉనికిని చాటుకుంటూ ఉంటాడు, కానీ వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఎప్పుడు కనిపించిన దాఖలాలు లేవు. అయినా అతని తప్పేమి ఉందిలే, వైసీపీ నాయకత్వమే తెలంగాణ వివిషయాన్నీ ఎప్పుడో వదిలేసి, తమ పార్టీ ఓటు బ్యాంకును పూర్తిగా తెరాస కు సరెండర్ చేసి వెళ్ళిపోయింది. అసలు గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఎలాంటి ప్రకటన చేయకపోయిన పట్టించుకునే వాడెవడు లేడు, దాదాపుగా తెలంగాణలో వైసీపీ దుకాణం బంద్ అయినట్లే అనుకున్న తరుణంలో ఒక ప్రకటన విడుదల చేయటం ఎదో హడావిడి చేయటానికే తప్ప ఇక ఎలాంటి లాభం లేదు..