వైసీపీ లో పదవులు రాక కొందరు ఏడుస్తుంటే ఉన్న పదవిని కాపాడుకోకుండా నోటి దూల తీర్చుకుంటున్నారట ఒక ఎంపి.. ఎవరైన సొంత పార్టీ మేలు కోరుతారు కానీ ఈయన మాత్రం పిలిచి పదవిచ్చిన పార్టీకే కన్నాలు వేస్తున్నారట.. ఇంతకు అంతటి మహానుభావుడు ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆయన పేరే రఘురామకృష్ణంరాజు.. ఈయన తీరు పార్టీ కేడర్‌కు తలనొప్పిగా మారిందంటున్నారు వైసీపీ వర్గీయులు.. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పై తరుచూ విమర్శలు గుప్పిస్తూ ఆ పార్టీలో కొరకరాని కొయ్యలా మారాడన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఆయన తీరుపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రఘురామకృష్ణంరాజు సభ్యత్వాన్ని రద్దుచేయిస్తామని కూడా వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా తాజాగా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్య వ్యవస్థపై ఏ మాత్రం విశ్వాసం ఉన్నా, తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని, ఈ విషయంలో తక్షణమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌తో ప్రభుత్వం చర్చించాలని వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తూ రఘురామకృష్ణంరాజు విమర్శలు గుప్పించారు.. ఇక వైఎస్ జగన్ ఆయనను ఎంపీగా చేసి ఎంతో గౌరవించారని, మొదటిసారి ఎంపికైనా స్టాండింగ్ కమిటీలో స్థానం కల్పించినా ఆయన గౌరవం నిలబెట్టుకోవడంలేదని సీయం సన్నిహితులు ఆరోపిస్తున్నారు..
ఇప్పటికే రఘురామకృష్ణం రాజుపై స్పీకర్ ఓం బిర్లాకు, వైఎస్‌ఆర్‌సీపీ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీ టికెట్‌పై గెలిచిన రఘురామకృష్ణంరాజు పార్టీగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.. మరి ఎవరి మనసులో ఏముందో తెలియదు గానీ సొంత పార్టీకే కుంపటి పెడుతున్న ఈ వైసీపీ ఎంపీ వల్ల నష్టం జరగక ముందే వైఎస్ జగనన్ మేలుకుంటే మంచిదని ఆయన సన్నిహితులు అంటున్నారు.. అంటే తొందర్లోనే రఘురామకృష్ణంరాజు పోస్టు ఉంటుందా ఊడుతుందా అనేది తెలుస్తుందన్న మాట..