ఆ ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆనందంలో మునిగిపోతున్నారంట.

ycp mla's are in full happiness

వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక రానుంది. దీంతో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టి పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాలను జగన్ పట్టించుకోలేదు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు పదిహేను నెలలుగా పడకేశాయనే చెప్పాలి.

ycp mla's are in full happiness
ycp mla’s are in full happiness

అయితే అనూహ్యంగా ఉప ఎన్నిక వస్తుండటం, విజయం తప్పనిసరి కావడంతో జగన్ అప్రమత్తమయ్యారు. తిరుపతి పార్లమెంటు నియోజకవవర్గం పరిధిలో ఉన్న సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా నిధులు విడుదల కానున్నాయి. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ పనులపై సీఎంవో కార్యాలయం ఆరా తీస్తుంది.

ఉదాహరణకు తిరుపతి నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. పదిహేను నెలల కాలంలో తిరుపతిలో జరిగిన అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. అలాగే వెంకటగిరి నియోజకవర్గ సమస్యలపై అక్కడ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అనేకసార్లు ప్రస్తావించారు. కానీ ఇప్పటి వరకూ సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిన జగన్ ప్రభుత్వం నియోజకవర్గం సమస్యలను గురించి పట్టించుకోలేదు.

కానీ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక రానుండటంతో ఈ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు ఊపందుకోనున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా నిధులను విడుదల చేయడానికి జగన్ సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తిచేయాలని సీఎంవో కోరడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఆనందంగా ఉన్నారు. అయితే అదే సమయంలో ఈ ఎమ్మెల్యేలకు మెజారిటీ టార్గెట్ ను కూడా జగన్ విధించనున్నారు. ఉప ఎన్నికలో గెలవడమే లక్ష్యంగా ఆ ఏడు నియోజకవర్గాల్లో నిధుల వరద పారనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.