‘నక్కిలీసు గొలుసు’ పాటకు చిందులేసిన వైసీపీ ఎమ్మెల్యే!

ఎప్పుడూ గొడవలతో, అల్లర్లతో కనిపించే రాజకీయ నాయకులు ఒకేసారి ఏదైనా హంగామా సృష్టిస్తే మాత్రం అది వైరల్ గా మారుతుంది. అలా తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే చేసిన హంగామా కూడా నెట్టింట్లో వైరల్ గా మారింది. తాజాగా ఆయన ‘నక్కిలీసు గొలుసు’ పాటకు తెగ చిందులేసాడు.

చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం కు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు తాజాగా ఓ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో తన డాన్స్ టాలెంట్ ఏంటో చూపించాడు. అక్కడ డీజే బాక్సులో నక్కిలేసు గొలుసు పాట రావడంతో వెంటనే స్టెప్పులతో ఊగిపోయాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ గా మారింది.