వైసీపీని ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడంలో అంబటి రాంబాబు దిట్ట. ఆయన వైసీపీ ఎమ్మెల్యే మాత్రమే కాదు.. ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా. అందుకే… ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విరుచుకుపడుతుంటారు అంబటి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయింది. ఇంత తక్కువ సమయంలోనే పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించి.. ప్రజల హృదయాల్లో సీఎం జగన్ చిరస్థాయిలో నిలిచిపోయారని… అయినప్పటికీ.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా వైసీపీ ప్రభుత్వంపై పిచ్చి కూతలు కూస్తోందని అంబటి మండిపడ్డారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం ఆసుపత్రులను ధ్వంసం చేశారు. స్కూళ్లను నాశనం చేశారు. 108, 104 వాహనాలు లవు. కానీ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. వాటన్నింటినీ మళ్లీ తీసుకురావడమే కాదు.. వాటికి కొత్త శోభ వచ్చింది. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదట. పేదల కడుపు కొడుతూ.. పేదల నోటి దగ్గరి అన్నాన్ని లాక్కుంటూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.. అంటూ అంబటి రాంబాబు ఈసందర్భంగా ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఓ మాయల ఫకీర్ రా మారి.. అడ్డుపుల్లలు వేస్తూ ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగకుండా కుట్రలు చేస్తున్నారని.. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా.. ఏపీ ప్రజల గుండెల్లో వైఎస్ జగన్ చిరకాలం నిలిచిపోతారని అంబటి పేర్కొన్నారు.